IPL 2025లో భాగంగా నేడు డబుల్ ధమాకా మోగనుంది. దాదాపు వీకెండ్‌లో శని, ఆదివారాల్లో మాత్రమే రెండు మ్యాచులు జరుగుతుంటాయి. కానీ మంగళవారం (ఏప్రిల్ 8) రెండు మ్యాచులు అభిమానులను అలరించనున్నాయి. దీంతో వర్కింగ్ డే రోజూ ఫ్యాన్స్ పరుగుల వర్షంలో తడిసి ముద్దవనున్నారు. కాగా షెడ్యూల్ ప్రకారం ఆదివారం (ఏప్రిల్ 6) కోల్‌కతాలో రెండు మ్యాచులు జరగాల్సి ఉండగా శ్రీరామ నవమి(Sri Rama Navami) సందర్భంగా పోలీసులు భద్రత కల్పించలేమని చెప్పడంతో రెండు రోజులు వాయిదా వేశారు.
ఈడెన్‌లో లక్ ఎవరిదో..
ఈ మేరకు తొలి మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్(KKR vs LSG) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మధ్యాహ్నం 3.30 నుంచి జరుగుతుంది. ఈ మ్యాచులో రహానే సారథ్యంలోని సునీల్ నరైన్(Sunil Narine), ఆండ్రీ రస్సెల్(Andre Russell) రాణిస్తే KKRకు విజయం సులవే. అటు లక్నో జట్టు భీకర ఫామ్‌లో ఉంది. మిచెల్ మార్ష్(Marsh), పూరన్(Pooran), మార్క్రమ్ వంటి ప్లేయర్లు రాణిస్తున్నారు. దీంతో గెలుపుపై ఆ జట్టు ధీమాతో ఉంది. పాయింట్ల పట్టికలో కేకేఆర్ 5వ స్థానంలో ఉండగా లక్నో ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి.
ముల్లాన్‌పూర్‌లో కింగ్స్ వర్సెస్ కింగ్స్
ఇక రెండో మ్యాచులో పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(PBKS vs CSK) మధ్య కీలక పోరు జరగనుంది. చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్‌ను విక్టరీతో ప్రారంభించిన CSK ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములతో చతికిలపడింది. పైగా ధోనీ(MS Dhoni) ఉండటంతో అందరి చూపు ఈ మ్యాచ్‌పైనే ఉంది. అంటు పంజాబ్ వరుస విక్టరీలతో దూసుపోతూ.. గత మ్యాచ్‌లో రాజస్థాన్(RR)పై కంగుతింది. దీంతో మళ్లీ గెలుపు బాట పట్టాలని శ్రేయస్(Shreyas Ayyar) సేన భావిస్తోంది.
STAR SPORTS POSTER 🤯
-CSK vs PBKS
-KKR vs LSG #แผ่นดินไห #earthquake#ตึกถล่ม #CSKvPBKS #KKRvLSG pic.twitter.com/vBaxKySM19
— Deepak. (@imdeepak79) April 8, 2025






