విద్యార్థులకు అలర్ట్.. యూజీసీ నెట్‌ పరీక్ష వాయిదా

విద్యార్థులకు అలర్ట్. ఈ నెల 15న జరగాల్సిన యూజీసీ నెట్‌ (UGC NET) పరీక్ష వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని అందులో పేర్కొంది. ఈ నెల 16న జరగాల్సిన పరీక్షను మాత్రం యథాతథంగా నిర్వహిస్తామని తెలిపింది.

యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

యూజీసీ నెట్‌ 2024 (డిసెంబర్‌) పరీక్షలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల 3వ తేదీన మొదలైన ఈ పరీక్షలు ఈ నెల 16వ తేదీన ముగియనున్నాయి. అయితే సంక్రాంతి పండుగ రోజున కూడా పరీక్ష ఉండటంతో  అభ్యర్థులు ఆరోజు పరీక్ష వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఈ పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.

Related Posts

గ్రూప్​-1 రిజల్ట్స్ అప్డేట్.. 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా ఎప్పుడంటే?

గ్రూప్-1 (TG Group 1) పరీక్షలు రాసిన అభ్యర్థులకు అలర్ట్. రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం విజయవంతంగా ముగిసినట్లు టీజీపీఎస్సీ (TGPSC) అధికారులు తెలిపారు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2…

జేఈఈ మెయిన్‌ ప్రాథమిక కీ విడుదల

విద్యార్థులకు అలర్ట్. జేఈఈ మెయిన్‌ (JEE Main) తొలి విడత పేపర్‌-1 పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. జనవరి 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి.  ఈ నేపథ్యంలో మంగళవారం రోజున ప్రాథమిక ‘కీ’ రిలీజ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *