Mana Enadu : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా.. పార్శిల్ లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం (Dead Body Parcel) వచ్చింది. అది చూసి మహిళతో పాటు ఆ గ్రామస్థులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే..?
యండగండి (AP Crime News) గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో మొదటి విడతలో ఆ సేవా సమితి మహిళకు టైల్స్ అందజేసింది. ఇక మరోసారి ఆర్థిక సాయం కోసం ఆమె దరఖాస్తు పెట్టుకుంది. ఈసారి ఇంటికి సంబంధించి విద్యుత్ సామగ్రి రావాల్సి ఉంది.
పార్శిల్ డెడ్ బాడీ
అయితే రెండోసారి దరఖాస్తుకు సంబంధించి పార్శిల్ వచ్చింది. అందులో విద్యుత్ సామగ్రి వస్తుందని ఆమె భావించింది. కానీ విద్యుత్ సామగ్రికి బదులు పార్శిల్ లో మృతదేహం రావడంతో ఆమె షాక్ అయింది. ఈ విషయం కుటుంబ సభ్యుల ద్వారా గ్రామస్థులకు తెలియడంతో వారు భయాందోళనకు గురయ్యారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఆ డెడ్ బాడీ ఎవరిది?
అక్కడికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీం అస్మి మృతదేహాన్ని చేరుకుని పరిశీలించా?రు. ఈ ఘటనపై ఆరా తీసిన ఆయన పార్శిల్ విషయం తెలుసుకున్నారు. వెంటనే పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చింది.. మధ్యలో ఎవరైనా పార్శిల్ ను మార్చారా.. ఇంతకీ ఆ మృతదేహం ఎవరిది.. అనే విషయాలపై ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.






