అమరావతికి రూ.6,800 కోట్లు.. వరల్డ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్

Mana Enadu : ఏపీ ప్రభుత్వానికి తీపి కబురు. ఏపీ రాజధాని అమరావతి(Amaravati Works)కి మహర్దశ వచ్చేసింది. ఇప్పటికే 6,700 కోట్ల రుణాన్ని ఏడీబీ (Asian Development Bank) మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రపంచ బ్యాంకు కూడా అమరావతికి రుణం మంజూరు చేస్తూ ప్రకటన జారీ చేసింది. గురువారం రోజున జరిగిన వరల్డ్ బ్యాంక్ బోర్డు (World Bank Board Meeting) సమావేశంలో అమరావతి నిర్మాణానికి 6,800 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. గతంలో అమరావితికి నిధులు ఇస్తామని, ప్రపంచ బ్యాంకు, ఏడీబీల ద్వారా నిధులు సమకూరుస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

వరల్డ్ బ్యాంకు, ఏడీబీల ద్వారా 13,500 కోట్ల నిధులు సమకూరుస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో ఏడీబీ 6,700 కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించగా.. తాజాగా వరల్డ్ బ్యాంకు కూడా రూ.6800 కోట్ల మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు ఇప్పటికే 33,137.98 కోట్ల రూపాయలతో 45 ఇంజినీరింగ్‌ పనుల్ని చేపట్టేందుకు సీఆర్డీఏకి (Capital Region Development Authority) రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

సీఎం చంద్రబాబు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.  అమరావతికి హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు.. జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్ల రుణాలు తీసుకోవడానికి సీఆర్‌డీఏకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మూడేళ్లలో రాజధానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేస్తామని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి స్పష్టం చేశారు. 2025 జనవరిలో రూ. 62 వేల కోట్లతో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *