ఆ రోజుని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా.. అన్‌స్టాపబుల్ షోలో బాబు ఎమోషనల్

Mana Enadu: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్(Unstoppable 4)’. తాజాగా ఈ షో విజయవంతంగా నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది. మూడు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షోను బాలకృష్ణ(Balakrishna) తన ఎనర్జీతో విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇప్పటికే ఈ టాక్ షోకు ఎంతో మంది స్టార్ హీరోలు హాజరయ్యారు. తాజాగా నాలుగో సీజన్ షురూ అయింది. తొలి ఎపిసోడ్‌కి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(AP CM Nara Chandrababu Naidu) గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా బావమరిది, బావ మధ్య ఆసక్తికర ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది.

 చాలా తెలివిగా ఆన్సర్స్ ఇచ్చిన బాబు

మరోసారి తన ఎనర్జీతో హోస్ట్‌(Host)గా ఆకట్టుకున్నారు బాలయ్య. ఎక్కడా తగ్గని ఎనర్జీతో సీజన్ 4ను షురూ చేశారు. ఇక తన ఎనర్జీతో గెస్ట్‌లుగా వచ్చిన వారిని తికమక పెట్టె బాలకృష్ణ బాబు గారిని కూడా అలాంటి ప్రశాలతో ముంచెత్తారు. ఆ ప్రశ్నలకు చంద్రబాబు చాలా తెలివిగా ఆన్సర్స్(Answers wisely) ఇచ్చారు. షో స్టార్టింగ్ లో బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఓత్ అంటూ ఓ బుక్‌(Oath book)పై ఈ షోలో తాను అడిగే ప్రశాలకు ప్రేమతో సవ్వుతూ సమాధానం చెప్తాను అని చంద్రబాబుతో ప్రమాణం చేయించుకున్నారు బాలయ్య.

దానికి బాబు నేను సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్తాను అని నవ్వులు పూయించారు. అలాగే బాలయ్య మీద ఒట్టు కూడా వేయబోయారు బాబు. ఇక బాలకృష్ణ చంద్రబాబును తన ఫ్యామిలీ సంబంధించిన ప్రశ్నలతో తికమక పెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మా చెల్లెలితో ( చంద్రబాబు సతీమణి భవనేశ్వరి)తో చూసిన రొమాంటిక్ సినిమా ఒకటి చెప్పండి అని అడగ్గా.. నువ్వు మరీ క్రాస్ ఎగ్సామినేషన్(Cross examination) చేస్తున్నావ్ అని నవ్వుతూ అన్నారు చంద్రబాబు.

 అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా

గతంలోనూ తాను అన్ స్టాపబుల్ టాక్ షోకి వచ్చానని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నానని చంద్రబాబు వెల్లడించారు. ఆ తర్వాత ప్రజలు గెలవాలన్న లక్ష్యంగా కృషి చేసి విజయం అందుకున్నామని, ఇప్పుడు CM హోదాలో మరోసారి అన్ స్టాపబుల్ షోకి వచ్చానని వివరించారు. మీరు అన్ స్టాపబుల్… మేం రాజకీయాల్లో అన్ స్టాపబుల్ అని చంద్రబాబు చమత్కరించారు. ఇక, తాను మొదటిసారిగా జైలులో అడుగుపెట్టిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. నాడు నంద్యాలలో నోటీసులు లేకుండా అరెస్ట్ వారెంట్ ఇచ్చారని, గట్టిగా అడిగితే, తర్వాత నోటీసులు ఇస్తామని చెప్పారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

 ప్రజలను చూడగానే సంతోషం కలిగింది

ఏ తప్పు చేయని నాకు అలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. నిప్పులా బతికిన నాకు ఆ ఘటనను జీర్ణించుకోవడం చాలా కష్టమైంది అని వివరించారు. ఓ నేతకు కష్టం వస్తే ప్రజలు ఎలా స్పందిస్తారన్నది నా విషయంలో చూశాను. కుటుంబం కంటే ప్రజల కోసమే ఎక్కువ సమయం కేటాయించాను. జైల్లో 53 రోజులు ఉన్న తర్వాత బయటికొచ్చి ప్రజలను చూడగానే సంతోషం కలిగిందని చెప్పాబు బాబు.

 అరెస్టు కాకపోయినా పొత్తు ఉండేదేమో..

నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) వచ్చారు. ఆయనతో నేను మాట్లాడింది రెండే నిమిషాలు. పొత్తు(Alliance)పై నేనే ప్రతిపాదన చేశాను. అయితే ఆలోచించి నిర్ణయం తీసుకోమని పవన్‌ను కోరాను. కానీ ఆయన జైలు నుంచి బయటికొచ్చిన వెంటనే పొత్తు ఉంటుందని ప్రకటించారు. బీజేపీని కూడా ఒప్పిస్తామని చెప్పారు. కూటమి విజయానికి జైలు సాక్షిగా పునాది పడింది. ఒకవేళ నేను అరెస్ట్(Arrest) కాకపోయినా కూటమి ఏర్పడేది అనుకుంటున్నా. తప్పు చేయనప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు పరీక్షలు ఎదురవుతుంటాయి.వాటిని ఎదుర్కోవాల్సిందే” అని చంద్రబాబు పేర్కొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *