వేసవి వచ్చినా ఇప్పటి వరకు సరైన బొమ్మ థియేటర్లో పడలేదు. ప్రతి ఏడాది సమ్మర్ సీజన్(Summer Season 2025)లో వినోదాల విందు పంచేందుకు బడా హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ మొదలై సగం రోజులు గడిచినా ఒక్క స్టార్ హీరో మూవీ థియేటర్లోకి రాలేదు. అయితే చిన్న చిత్రాలు, డబ్బింగ్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చూపుతున్నాయి. అలా ఈ వారం తమన్నా ఓదెల-2 (Odela 2), కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతితో పాటు మరికొన్ని చిత్రాలు సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి.
సమ్మర్ సందడి
ఈ వారం బాక్సాఫీస్ వద్ద కాస్త సందడి తక్కువగా ఉంది. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి(Arjun S/O Vyjayanthi)తో పాటు శివశక్తిగా తమన్నా తన విశ్వరూపం చూపించేందుకు ఓదెల-2తో థియేటర్లోకి వచ్చేస్తోంది. ఇక ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు అక్షయ్ కుమార్ నటించిన పాపులర్ మూవీ కేసరికి సీక్వెల్ గా కేసరి చాప్టర్-2 (Kesari Chapter-2) వస్తోంది. ఈ వారం ఈ మూవీ కూడా థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు ఓటీటీలో సందడి చేసేందుకు సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ అయ్యాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..?
థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలివే
- ఓదెల-2 – ఏప్రిల్ 17
- అర్జున్ సన్నాఫ్ వైజయంతి – ఏప్రిల్ 18
- కేసరి చాప్టర్-2 – ఏప్రిల్ 18
ఈ వారం ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లివే
అమెజాన్ ప్రైమ్
- గాడ్‌ఫాదర్ ఆఫ్ హాలెం (వెబ్‌సిరీస్)- ఏప్రిల్ 13
- ఖౌఫ్ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 18
సోనీలివ్
- చమక్: ది కన్‌క్లూజన్ (హిందీ సిరీస్)- ఏప్రిల్ 14
జియో హాట్‌స్టార్
- ది లాస్ట్ ఆఫ్ అజ్2 (వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 14
- ది స్టోలెన్ గర్ల్ (వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 16
నెట్‌ఫ్లిక్స్
- ది గ్లాస్ డోమ్ (వెబ్‌సిరీస్)- ఏప్రిల్ 15
- ఐ హోస్టేజి (మూవీ)- ఏప్రిల్ 18






