UPI: దేశవ్యాప్తంగా యూపీఐ సర్వర్ డౌన్!

ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటల్(Digital) మయమైపోయింది. దీంతో సగటు వినియోగదారుడు జేబులో డబ్బులను తీసుకెళ్లడం దాదాపు మానేశాడు. స్మార్ట్ ఫోన్(Smart Phone) ఉన్న ప్రతిఒక్కరూ ఏ చిన్న వస్తువు కొన్నా ఆన్‌లైన్‌లోనే పేమెంట్స్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే యూపీఐ(UPI) సేవలూ విస్తరించిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటివి టాప్ యూపీఐ సర్వీసులను అందజేస్తున్నాయి. అయితే ఒక్కోసారి ఈ యూపీఐ సర్వీసులు సతాయిస్తుంటాయి. దీంతో వినియోగదారులకు(Customers) తీవ్ర ఇబ్బందులు తప్పవు. తాజాగా ఈరోజు సాయంత్రం అదే జరిగింది.

వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు

బుధవారం సాయంత్రం దేశవ్యాప్తం(India)గా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. యూపీఐ సర్వర్ డౌన్(Server Down) కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఐ ద్వారా జరిగే ఆన్‌లైన్ సేవలు(Online Service) దాదాపు గంటకు పైగా నిలిచిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి సేవలు పనిచేయడం లేదు.

UPI Payments Issue Resolved After Several Users were Unable to Make Transactions - Gizbot News

పెట్రోల్ బంకులు, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన వివిధ ప్రాంతాల్లో ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలనుకున్న వారు ఇబ్బంది పడ్డారు. ఈ సమస్యపై వినియోగదారులు సామాజిక మాధ్యమాల(Social Media) ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత UPI సేవల్లో అంతరాయం ఏర్పడింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *