బోల్డ్ ఫ్యాషన్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది నటి ఉర్ఫీ జావేద్ (Urfi Javed). చిత్ర విచిత్రమైన కాస్ట్యూమ్స్ ధరిస్తూ జనాల్లో ఎలాంటి బెరుకు లేకుండా తిరుగుతూ సెలబ్రెటీ అయిపోయింది. హిందీ బిగ్‌బాస్ ద్వారా ఫేమస్ అయ్యింది. తాను వేసుకునే కాస్టూమ్స్తోనే క్రేజ్ సంపాదించుకుంది ఉర్ఫీ జావెద్. ఆమె వేసుకునే కాస్ట్యూమ్స్ చూస్తే అసలు ఇలాంటివి కూడా వేసుకుంటారా అనిపిస్తుంటుంది. అందుకే ఆమెపై సోషల్‌మీడియాలో జనాలు ట్రోల్ చేస్తూ ఉంటారు.
ముఖమంతా ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా..
అయితే ఉర్ఫీ ఇప్పుడు ఓ డిఫరెంట్ ట్రాన్స్పర్మేషన్తో వార్తల్లో నిలిచింది. గతంలో వేసుకున్న ఫేస్ ఫిల్లర్స్ తప్పుగా ఉన్నాయని గుర్తించి, వాటిని డిస్సాల్వ్ చేయించుకుంది. ఈ క్రమంలోనే ఆమె ముఖం ఉబ్బిపోయి అందవికారంగా కనిపిస్తోంది. ఉర్ఫీ 9 ఏళ్ల క్రితం లిప్ ఫిల్లర్స్ని (Lip Filler) ట్రై చేసింది. అయితే అది బెడిసికొట్టినట్లు తాజాగా గుర్తించింది. వాటిని మరో డాక్టర్ సాయంతో తీసివేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఉర్ఫీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘ఇది ఫిల్టర్ కాదు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. లిప్ ఫిల్లర్ రిమూవల్ సమయంలో తీసిన వీడియోను షేర్ చేయగా అందులో అందవిహీనంగా కనిపిస్తోంది. మొహమంతా ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా మారిపోయిది.
మోసపూరిత క్లినిక్‌లో వేయించుకోవడం వల్లే
మోసపూరిత క్లినిక్‌లో వేయించుకోవడం వల్లే నాకు ఇలాంటి పరిస్థితి తన ముఖానికి వేసుకున్న ఫేస్ ఫిల్లర్స్ వల్ల అసహజంగా మారిపోయానని, అవి తప్పుగా వేశారని గుర్తించి ఇప్పుడు తొలగించుకున్నానని నటి పేర్కొంది. ‘ఫిల్లర్స్ డిస్సాల్వ్ చేయడం ఎంత బాధాకరమో అంతే అవసరం కూడా. ఇది చాలా బాధతో కూడిన ప్రక్రియ. అయినా సరే మళ్లీ సహజంగా ఉండేలా వేయించుకుంటా. నేను ఫిల్లర్స్‌కి వ్యతిరేకం అనుకోకండి. కానీ మంచి డాక్టర్ దగ్గర వేయించుకోవడం ముఖ్యం. మోసపూరిత క్లినిక్‌లో వేయించుకోవడం వల్లే నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. చివరికి డాక్టర్ రిక్సన్‌ని కలవడంతో నా సమస్యకు పరిష్కారం దొరికింది’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
Urfi javed ने कराया filar treatment #urfijaved pic.twitter.com/hP3oo7n6vv
— sweety dixit (@sweetydixit6) July 22, 2025






