ఇప్పటి టెక్నాలజీ యుగంలో, సులభతనం కోసం ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా, వినియోగదారుల కోసం ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. అది ATM కార్డు లేకుండానే ATM మెషీన్ నుండి డబ్బులు విత్‌డ్రా(Cash Withdraw) చేసే యాప్. అంటే, మీ కార్డు తప్పిపోయినా లేదా ఇంట్లో మర్చిపోయినా కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటె చాలు. ATM మెషీన్ నుండి మీ డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు. ఎలాగంటారా.. మీ స్మార్ట్‌ఫోన్‌లోని UPI యాప్‌ను ఉపయోగించి నగదు తీసుకోవచ్చు.
ఇప్పుడు దేశంలోని ప్రధాన బ్యాంకులు ఎస్‌బిఐ(SBI), హెచ్‌డిఎఫ్‌సి(HDFC), ఐసిఐసిఐ(ICICI), పిఎన్‌బి(PNB), యాక్సిస్(Axis), యూసీఓ(UCO) వంటి బ్యాంకులు ఈ సదుపాయాన్ని తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఈ సేవను ‘కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్’(Cordless Cash Withdrawl) అని పిలుస్తారు. కొంతమంది బ్యాంకులు తమ స్వంత యాప్‌లు (ఉదా: SBI – YONO, ICICI – iMobile, Union Bank – UCash) ద్వారా ఈ సౌకర్యాన్ని అందించగా, చాలా బ్యాంకులు UPI ఆధారిత విత్‌డ్రాయల్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
డబ్బు విత్‌డ్రా చేసే విధానం:
*ముందుగా మీ సమీప ATM మెషీన్ వద్దకు వెళ్లండి.
*స్క్రీన్‌పై ‘Cardless Cash Withdrawal’ లేదా ‘UPI Withdrawal’ ఎంపికను ఎంచుకోండి.
*ఆపై స్క్రీన్‌పై ఒక QR కోడ్ కనిపిస్తుంది.
*మీ ఫోన్‌లోని UPI యాప్ (PhonePe, Google Pay, Paytm, BHIM వంటివి) ఓపెన్ చేయండి.
*’Scan & Pay’ లేదా ‘Scan QR’ ఎంపిక ద్వారా ATM స్క్రీన్‌పై చూపిన QR కోడ్‌ను స్కాన్ చేయండి.
*తర్వాత మీరు తీసుకోవాలనుకున్న నగదు మొత్తాన్ని ఎంటర్ చేసి, మీ UPI పిన్ ద్వారా లావాదేవీని ధృవీకరించండి.
*కొన్ని సెకన్లలో ATM మెషీన్ నుండి డబ్బు వస్తుంది.
ఈ entire ప్రక్రియలో మీరు ఏ కార్డు చూపించాల్సిన అవసరం ఉండదు. ఇది అత్యంత సురక్షితమైన విధానం. ముఖ్యంగా అనుకోని సమయంలో కార్డు లేకపోయినా, డబ్బు అవసరమైనప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సౌకర్యం వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, డిజిటల్ లావాదేవీలను మరింత భద్రతగా మారుస్తుంది.






