ఒకవైపు బాలీవుడ్(Bollywood)తో పాటు మరోవైపు టాలీవుడ్(Tollywood)లో కూడా ఫుల్ పాప్యులర్ అయిన నటి ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూ(Interview)లో తన పేరుపై ఉన్న ఆలయం గురించి చేసిన వ్యాఖ్యలు(Comments) తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై టీమ్ క్లారిటీ(Clarity) ఇచ్చింది. ఆమె వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది. ఈమేరకు ఇన్‌స్టాలో పోస్ట్‌లో వివరణ ఇచ్చింది.
UNESCO has given the “World’s Most Gawar & Pretentious Aurat” award to Urvashi Rautela. pic.twitter.com/MSvbw6jArd
— Incognito (@Incognito_qfs) April 18, 2025
‘‘ఊర్వశీ ఆ వీడియో(Video)లో మాట్లాడుతూ.. తన పేరు మీద ఆలయం ఉందని చెప్పారు. అది తన ఆలయం అని చెప్పలేదు. అందరూ ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. దయచేసి వీడియో మరోసారి విని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఢిల్లీ యూనివర్సిటీ(Delhi University)లో నిజంగానే ఆమె ఫొటో(Photo)కు దండలు వేసి పూజిస్తారు. దీనిపై గతంలోనూ కథనాలు వచ్చాయి. అవి ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. నిరాధారమైన ఆరోపణలు, అవమానకరమైన వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలి’’ అని టీమ్ పేర్కొంది.
ఇంతకీ ఏమైందంటే..?
ఓ ఇంటర్వ్యూలో ఊర్వశీ మాట్లాడుతూ.. ‘నా పేరు మీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి(Urvashi Rautela Mandir)’ అని అన్నారు. ఈ కామెంట్స్‌పై బద్రీనాథ్ సమీపంలోని ఆలయాల అర్చకులు మండిపడుతున్నారు. నటి ఊర్వశీ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు.






