ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. బాలయ్య బర్త్ డే రోజు స్వీట్ సర్ ప్రైజ్

నందమూరి బాలకృష్ణ (Balakrishna).. డైరెక్టర్ గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) కాంబోలో వీరసింహారెడ్డి అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ కాంబోలో మరో ఫిల్మ్ వస్తే బాగుంటుందని బాలయ్య అభిమానులు భావించారు. అయితే వారి కోరిక మేరకు ఇప్పుడు ఈ కాంబో రిపీట్ కానుంది. బాలయ్య, గోపిచంద్ కలిసి మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

Image

బాలయ్య బర్త్ డే సర్ ప్రైజ్

ఈ సినిమా గురించి తాజాగా డైరెక్టర్ గోపీచంద్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బాలయ్యతో తాను చేయబోయే రెండో సినిమా కూడా ఫుల్ ఆన్ యాక్షన్ చిత్రంగా రాబోతుందని చెప్పారు.  ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ షేర్ చేశారు గోపీచంద్. బాలకృష్ణ పుట్టినరోజు (Balakrishna Birth Day) సందర్భంగా జూన్‌ 10వ తేదీన ఈ సినిమాను ప్రారంభించనున్నామని గోపీచంద్ బాలయ్య అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

Image

అఖండ తర్వాత ఆ సినిమాయే

ఈ విషయం తెలిసి బాలయ్య అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. తమ అభిమాన హీరో నుంచి మరో పవర్ ఫుల్ యాక్షన్ సినిమా రాబోతోందని సంబుర పడుతున్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ (Boyapati Srinu) దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య గోపించద్ మూవీ కోసం రంగంలోకి దిగనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మరో నిర్మాణ సంస్థతో కలిసి వృద్ధి సినిమాస్‌ నిర్మించనుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *