కొత్త సినిమా వివాదం.. స్టార్ హీరోపై ఎఫ్ఐఆర్ నమోదు

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జాట్ (Jaat)’. ఈ సినిమా ప్రస్తుతం లీగల్ చిక్కుల్లో పడింది. ఈ మూవీలోని ఓ సీన్ ఓ మతానికి సంబంధించిన వారి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆయనతో సహా సినిమాలో నటించిన పలువురిపై ఎఫ్​ఐఆర్ నమోదు అయ్యింది.

మా మనోభావాలు దెబ్బతిన్నాయ్

జాట్ (Jaat Controversy) సినిమాలోని ఓ సన్నివేశం తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని పంజాబ్​కు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలనే ఇలాంటి సీన్​ను సినిమాలో పెట్టారని ఆరోపిస్తూ ఆ చిత్రంలో నటించిన వారిపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో జాట్ డైరెక్టర్ గోపీ చంద్ (Director Gopichand), హీరో సన్నీ డియోల్ సహా పలువురు నటీనటులుపై అధికారులు కేసు నమోదు చేశారు.

మమ్మల్ని క్షమించండి

అయితే ఈ వివాదంపై తాజాగా మేకర్స్ స్పందించారు. తాము కావాలని ఒక వర్గాన్ని అనుమానించాలని చేయలేదని.. చెబుతూ  క్షమాపణలు కోరారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థ (Mythri Movie Makers) ఓ నోట్ విడుదల చేసింది. ‘జాట్‌ సినిమాలోని ఓ సీన్​పై నెగెటివ్‌ రియాక్షన్‌ వచ్చింది. చాలా విమర్శలు వెల్లువెత్తాయి. తెలియకుండా మా వాళ్ల బాధపడినందుకు మేము చింతిస్తున్నాం. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనేది మా ఉద్దేశం కాదు. ఆ సన్నివేశాన్ని ఇప్పటికే తొలగించాం’ అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *