Drishyam-3: ‘దృశ్యం 3’ మూవీ రీమేక్‌కి చెక్.. ఎందుకో తెలుసా?

మలయాళంలో ‘దృశ్యం(Drishyam)’ ఫ్రాంచైజీకి ఫుల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలూ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ ఫ్రాంచైజీ ఇతర భాషల్లోనూ రీమేక్‌(Remake) అయ్యి.. ప్రతి భాషలోనూ గ్రాండ్ సక్సెస్ సాధించింది. దీంతోనే దేశవ్యాప్తంగా ‘దృశ్యం ఫ్రాంచైజీ’ ఓ సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. ఈ క్రెడిట్‌ పూర్తిగా దర్శకుడు జీతూ జోసఫ్‌(Director Jeethu Joseph)కే దక్కుతుంది. ప్రస్తుతం జీతూ ‘దృశ్యం 3’ తెరకెక్కించే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమా కూడా ఇతర భాషల్లో రీమేక్‌ అవ్వడం ఖాయం అని అందరూ అనుకుంటున్న తరుణంలో స్టార్ హీరో మోహన్ లాల్(Mohan Lal) చెక్ పెట్టారు.

రూ.500 కోట్ల టార్గెట్‌

‘దృశ్యం 3’ని రీమేక్‌ చేయాలని చూస్తున్న ఇతర భాషలకు చెందిన మేకర్లందరి ఉత్సాహానికీ హీరో మోహన్‌లాల్‌(Mohan Lal) అడ్డుకట్ట వేశారు. మలయాళంలో రూపొందుతున్న ‘దృశ్యం 3’ ఈ దఫా పాన్ ఇండియా(Pan India) స్థాయిలో విడుదల కానుంది. అన్ని భాషల్లోనూ ఇక హీరో మోహన్‌లాలే. దర్శకుడు జీతూ జోసఫ్పే. మలయాళంలో వందకోట్లు, హిందీ(Hindi)లో రెండొందల కోట్లు, ఇతర భాషలన్నీ కలిసి ఓ రెండొందల కోట్లు.. ఇలా దాదాపు రూ.500 కోట్లకు టార్గెట్‌ పెట్టారట హీరో మోహన్‌లాల్‌. కాగా తెలుగు వర్షెన్ దృశ్యం, దృశ్యం-2 సినిమాల్లో విక్టరీ వెంకటేశ్(Venkatesh), మీనా(Meena) ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *