Cannes 2025: అట్టహాసంగా కేన్స్ ఫెస్టివల్.. మెరిసిన ఇండియన్ తార

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి గాంచిన కేన్స్‌ (Cannes 2025) ఫెస్టివల్ మంగ‌ళ‌వారం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. 78వ ఈ చిత్సోత్సవాలు ఫ్రాన్స్‌లో మొదలవగా హాలీవుడ్ సెల‌బ్రిటీలు సంద‌డి చేశారు. వివిధ రకాల వ‌స్త్ర‌ధార‌ణ‌ల్లో హాజ‌రై ఫెస్టివ‌ల్‌కు కొత్త‌ క‌ళను తీసుకువ‌చ్చారు. ఈ సందర్భంగా మ‌రో వారం రోజుల్లో వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న‌ చార్లీచాప్లిన్ గోల్డ్ ర‌ష్ మూవీని ప్ర‌ద‌ర్శించారు. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ : ది ఫైనల్‌ రెకనింగ్‌’, ‘హయ్యెస్ట్‌ 2 లోయెస్ట్‌’ వంటి సెల‌క్ట్ చేసిన కొన్ని చిత్రాలు త్వరలో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

సిమీ గరేవాల్ కేన్స్ రెడ్ కార్పెట్‌పై..

ఇక మ‌న దేశం నుంచి ఈ ద‌ఫా పామ్ డి’ఓర్ (Palme d’Or) పోటీలో ఏ చిత్రం ప్ర‌ద‌ర్శించేందుకు అర్హత సాధించలేకపోయాయి. అయితే 1970ల‌లో సత్యజిత్‌ రే తెర‌కెక్కించిన‌ ‘అరణ్యేర్‌ దిన్‌ రాత్రి’ (Aranyer Din Ratri)చిత్రాన్ని మే 19న ‘కేన్స్‌ క్లాసిక్‌’ విభాగంలో 4కే వెర్షన్‌లో ప్రదర్శించనున్నారు. సినిమాలో గిరిజన సంతల్‌ అమ్మాయి దులిగా నటించిన సిమీ గరేవాల్ కేన్స్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్ట‌నున్నారు.

కేన్స్ 2025లో తొలిసారి

ఎప్ప‌టిలానే ఈసారి కూడా బాలీవుడ్ నుంచి అగ్ర న‌టీమ‌ణులతో పాటు లాప‌తా లేడీస్ మూవీ ఫేమ్‌ నితాన్షి గోయల్ కేన్స్ వేడుకలకు అటెండ్ కానున్నారు. భారత్ నుంచి తొలిరోజు బాలీవుడ్‌, టాలీవుడ్ న‌టి ఊర్వ‌శి రౌతేలా హాజరైంది. జాదుగ‌ర్ డిజైన్ డ్రెస్సింగ్‌తో రెడ్ కార్పెట్లో ఆక‌ట్టుకుంది. నటి ఆలియా భట్ లోరియల్ అంబాసిడర్‌గా కేన్స్ 2025లో తొలిసారి అడుగు పెట్టాల్సి ఉండగా.. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా ప్రారంభోత్సవ వేడుకలకు హాజరు కాలేదు. తర్వాతి రోజుల్లో వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఫెస్టివల్‌ను పుర‌స్క‌రించ‌కుని లెజండ‌రీ యాక్ట‌ర్‌ రాబర్ట్ డి నీరో గౌరవ పామ్ డి’ఓర్ అవార్డు అందుకున్నారు. ప్రముఖ యాక్టర్ లియోనార్డో డికాప్రియో ఆయనకు అవార్డు అందజేశారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *