
అమెరికా(US) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు దీర్ఘకాల సిరల వ్యాధి (Chronic Venous Disease)గా నిర్ధారణ అయింది. ఇది సాధారణ రక్తప్రసరణ వ్యాధి(Circulatory disease) అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్(White House Press Secretary Carolyn Leavitt) ప్రకటించారు.70 ఏళ్లు దాటిన వారిలో సాధారణంగా ఇది కనిపిస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో, చీలమండ వద్ద వాపు రావడంతో వైద్యులు(Doctors) పరీక్షించారు. దీన్ని సాధారణ సిరల లోపం(Venous Insufficiency)గా నిర్ధారించారు. భయపడాల్సినంత పరిస్థితి లేదన్నారు. ‘డీప్ వీన్ థ్రోంబీసిస్’ (Blood clot in blood vessels) లేదా ‘ఆర్టీరియల్ వ్యాధి’ (Arterial disease) కాదన్నారు. ఇతర వైద్యపరీక్షల్లో గుండె, కిడ్నీ(Kidney) వైఫల్యంగానీ లేదని తేలినట్లు తెలిపారు.
ట్రంప్ ఆరోగ్యం ఆయన పాలనపై ప్రభావం చూపుతుందా?
ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన ఎలాంటి అసౌకర్యానికి గురవడం లేదన్నారు. తన ఆరోగ్యం పట్ల పారదర్శకత ఉండాలనే ఈ విషయం మీడియా ముందు వెల్లడిస్తున్నట్లు కరోలిన్ లీవిట్ తెలిపారు. ట్రంప్ చేతి వెనక భాగంలో గాయంలాంటిది కనిపించడంతో మీడియాలో ఫొటోలు దర్శనమిచ్చాయి. దీనిపై లీవిట్ స్పందిస్తూ.. తరుచుగా కరచాలనం(Shakehands) చేయడం, ఆస్పిరిన్(Aspirin) వాడకం వల్ల కలిగే సమస్యగా పేర్కొన్నారు. ప్రస్తుతానికి చికిత్స వివరాలను వెల్లడించలేదు. అయితే అధ్యక్షుడి వైద్య బృందం దీనిపై దృష్టి సారించింది. ఈ వార్త US రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఆరోగ్యం ఆయన పాలనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఊహాగానాలు పెరిగాయి.
NEWS: US President Donald Trump Diagnosed with Chronic Venous Insufficiency, a minor Health Concerns, White House Press Secretary Karoline Leavitt Confirmed during Press Briefing today 17th July 2025 pic.twitter.com/Jpkv3dsy5p
— B i a f r a T w i t t e r 🕊️ (@BiafranTweets) July 17, 2025