అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్(US China Trade War) కొనసాగుతోంది. ట్రంప్.. జిన్‌పింగ్(Trump vs Xi Jinping) సుంకాల విధింపులో ఏమాత్రం తగ్గట్లేదు. నిన్న చైనా ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్ విధించిన ట్రంప్.. తాజాగా దానిని 145 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది. కాగా అమెరికాగా తాజాగా విధించిన సుంకాలు 90 రోజుల్లో విడతల వారీగా అమలు చేస్తామని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
చైనా గూడ్స్‌పై అదనంగా మరో 34 శాతం
తాజాగా చైనా ఉత్పత్తుల(Chinese products)పై 145 శాతానికి టారిఫ్‌లను పెంచినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేయడం తీవ్ర సంచలనంగా మారింది. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అంతకుముందు ఉన్న 20 శాతం సుంకాలకు అదనంగా మరో 34 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభం అయింది. అయితే ట్రంప్ సుంకాలకు భయపడని.. చైనా.. ఢీ అంటే ఢీ అంటూ US వస్తువులపైనా భారీగా టారిఫ్(Tariffs)లు విధించింది.
US ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు
ఈ క్రమంలోనే US తీసుకుంటున్న చర్యలకు గట్టిగా బదులిస్తున్న చైనా(Chaina).. అమెరికా నుంచి చైనాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని ఇటీవల నిర్ణయించింది. చైనా తీసుకున్న ఈ చర్యపై తీవ్రంగా ప్రతిస్పందించిన ట్రంప్.. చైనాపై సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు చైనాపై సుంకాలు విధించారు. అటు చైనా కూడా US ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు విషయం తెలిసిందే.
Just thinking about the possibility of China banning or placing tariffs of 145% on the sale of Tesla cars or Apple phones in China. Nah, that would never happen, right? Asking for a friend. Uh…wait a sec. I gotta go now… $TSLA $AAPL $QQQ
— George Noble (@gnoble79) April 10, 2025







