ఇండియా నుంచి అమెరికా(INDIA to USA)కు కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఏ నమ్మలేకపోతున్నారా? అవునండీ. మీరు విన్నది నిజమే. కాకపోతే ఇప్పుడు కాదు. కాస్త టైమ్ పట్టొచ్చు. కాకపోతే ఇది జరగడం మాత్రం పక్కా అంటున్నాడు ట్విటర్ (X) అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్(Elon Musk). ఫ్యూచర్‌లో అత్యంత వేగంతో దూసుకెళ్లే సూపర్ ఫాస్ట్ ఫ్లైట్ల(Super fast flights)ను తీసుకొచ్చేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నాడు. తన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక(
Space X spacecraft)ను సూపర్ ఫాస్ట్ ఫ్లైట్‌గా మార్చే దిశగా ఆయన ప్రణాళికలు రూపొందించాడట. దీనిపై ఇప్పటికే శాస్త్రవేత్తల(scientists)తో చర్చలు కూడా ప్రారంభించినట్లు మస్క్ తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు.
మస్క్ ఫ్యూచర్ ప్రాజెక్టుపై వివేక్ రామస్వామితో చర్చ
ఎలాన్ మస్క్.. ఈ ప్రపంచ కుబేరుడి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తం(World Wide)గా మారుమోగుతోంది. మరీ ముఖ్యంగా US ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విజయం సాధించిన తర్వాత మస్క్(Musk) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ బిజినెస్ టైకూన్ ఇప్పుడు ఏకంగా అమెరికా ప్రభుత్వంలో భాగస్వామ్యం కానున్నాడన్న విషయమూ తెలిసిందే. అయితే తన తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ అయిన ‘Earth-To-Earth’ ఈ అల్ట్రా ఫాస్ట్ ట్రావెల్ గురించి మస్క్ వెల్లడించారు. వివేక్ రామస్వామి(Vivek Ramaswamy)తో ప్రభుత్వ సమర్థత విభాగానికి (DOGE) సహ-నాయకత్వం వహించేందుకు మస్క్ సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే స్పేస్ఎక్స్(Space X) ఫాస్ట్ విమానాలపై స్పందించాడు.
ఈ దేశాలకూ గంటల్లోనే చేరుకోవచ్చు
స్పేస్ ఎక్స్(Space X) నుంచి ఈ సూపర్ ఫాస్ట్ విమానాలు అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అదేగానీ జరిగితే.. రాబోయే రోజుల్లో అమెరికా నుంచి భారత్‌కు కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చట. ఇందులో ఒకేసారి 1000 మంది ప్రయాణికులను తీసుకెళ్లొచ్చట. స్పేస్‌లోకి వెళ్లకుండా భూమి ఉపరితలంతో సమాంతరంగా కక్ష్యలో ఈ సూపర్ ఫాస్ట్ విమానాలు(Super fast flights) ఎగురుతాయి. దీని ద్వారా లాస్ ఏంజిల్స్-టొరంటో 24నిమిషాలు, లండన్-న్యూయార్క్ 29నిమిషాలు, ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో 30నిమిషాలు, న్యూయార్క్-షాంఘై 39 నిమిషాల్లో చేరుకోవచ్చు. US- చైనా మధ్య ఫ్లైట్ జర్నీ టైమ్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ రెండు దేశాల మధ్య విమానంలో ప్రయాణించేందుకు దాదాపు 14.50 గంటలు పడుతుంది.
Under Trump's FAA, @SpaceX could even get Starship Earth to Earth approved in a few years — Taking people from any city to any other city on Earth in under one hour. pic.twitter.com/vgYAzg8oaB
— ALEX (@ajtourville) November 6, 2024