JD Vance భారత్‌లో అడుగుపెట్టిన అమెరికా ఉపాధ్యక్షుడు

అగ్రరాజ్యం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(US Vice President JD Vance) కుటుంబ సమేతంగా భారత పర్యటనకు వచ్చేశారు. సోమవారం ఉదయం వారి స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఏరియా(Palam Technical Area)లో ల్యాండ్ అయింది. JD వాన్స్ 4 రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తారు. వాన్స్ సతీమణి ఉషా వాన్స్(Usha Vance) భారత సంతతికి చెందినవారు కావడం తెలిసిందే. వాన్స్‌తో పాటు US ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఢిల్లీకి విచ్చేశారు. US ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాన్స్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

ప్రధాని మోదీతో కీలక చర్చలు

ఈ పర్యటనలో భాగంగా జేడీ వాన్స్ ఇవాళ పీఎం మోదీ(PM Modi)తో భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని(Trade agreement) త్వరగా ఖరారు చేసే అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ చర్చల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా పాల్గొంటారు. అనంతరం వాన్స్ తన కుటుంబంతో కలిసి ఆగ్రాను సందర్శిస్తారు.

US-INDIA బిజినెస్ సమ్మిట్‌లో

ఇక రేపు జైపూర్‌లోని ప్రసిద్ధ అమెర్ ప్యాలెస్‌(Amer Palace)ను సందర్శిస్తారు. అంతనతరం అక్కడి రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగే US-INDIA బిజినెస్ సమ్మిట్‌లో వాన్స్ కీలక ప్రసంగం చేస్తారు. ఇక బుధవారం రాజస్థాన్ CM భజన్ లాల్ శర్మ, గవర్నర్ హరిభావు బగాడేలతో సమావేశమవుతారు. గురువారం ఆయన ఢిల్లీ నుంచి అమెరికా(USA)కు తిరుగు పయనమవుతారు. వాన్స్ పర్యటన నేపథ్యంలో భారత్ పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *