తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ రేటు ఎంతంటే?

తగ్గేదేలే అంటూ బంగారం ధరలు (Gold Price Today) రోజురోజుకు పెరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో తులం పుత్తడి రేటు లక్ష రూపాయల వరకు చేరడం ఖాయం. అసలే ముందుంది శుభకార్యాల సీజన్. పెళ్లిళ్లు, పేరంటాలకు మగువల మెడలో తప్పక గోల్డ్ ఆభరణాలు ఉండాల్సిందే. అదో ప్రెస్టేజి ఇష్యూ మరి. కానీ ప్రస్తుతం పెరుగుతున్న గోల్డ్ ధరలు చూస్తుంటే ఈ సమయంలో అసలు పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే పరిస్థితులు లేవు. దీంతో పెరుగుతున్న పుత్తడి రేట్లు చూసి సామాన్యులు జంకుతున్నారు. తులం గోల్డ్ ధర లక్ష రూపాయలు చేరితే ఇక బంగారం కొన్నట్టేనంటూ వాపోతున్నారు.

లక్షకు చేరువలో బంగారం

దేశవ్యాప్తంగా మరోసారి గోల్డ్ ధరలు (Gold Rate in Hyderabad) పెరిగాయి. మొన్న దాదాపు రూ.2వేల వరకు పెరిగిన పసిడి రేట్లు తాజాగా వేయి వరకు పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా సోమవారం నాడు బంగారం ధరలు రూ.98వేల వద్ద కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు ఆదివారం రోజున రూ.97,580 ఉండగా సోమవారం నాటికి రూ.770 పెరిగి ప్రస్తుతం రూ.98,350 వద్ద పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర నిన్న రూ.89,450 ఉండగా ఇవాళ రూ.700 పెరిగి రూ.90,150 వద్ద కొనసాగుతోంది.

గోల్డ్ బాటలోనే వెండి

ఇక గోల్డ్ తో పాటు వెండి ధరలు (Silver Rate Today) కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఆదివారం రోజు కిలో వెండి ధర రూ.98,300 ఉండగా, సోమవారం నాటికి రూ.225 పెరిగి రూ.98,525కు చేరుకుంది. ఈ ధరలతో బంగారం, వెండి కొనుగోలు చేసే పరిస్థితులు లేవని సామాన్యులు వాపోతున్నారు. శుభకార్యాల సీజన్ ముందు ఉండటంతో గోల్డ్ కొనడం తప్పనిసరిగా మారింది. అయితే ధరలు చూస్తేనేమో మండిపోతున్నాయి. అయినా కొనుగోలు చేయడం తప్పదు. దీంతో సామాన్యులు ఈ రేట్లు ఇలాగే కొనసాగితే కష్టం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *