వరలక్ష్మి శరత్‌కుమార్(Varalakshmi Sarathkumar).. లేడీ ఓరియెంటెడ్ సినిమాలైనా, విలన్ క్యారెక్టర్‌లోనైనా, అక్కాచెల్లెలి పాత్రలోనైనా ఇలా ఏ పాత్ర ఇచ్చినా సరిగ్గా సెట్ అయే నటి. ప్రముఖ నటుడు శరత్ కుమార్(Sarathkumar) ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేసేస్తోంది. తనదైన నటన, వాక్చాతుర్యం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేస్తోంది. 2012లో ‘పోడా పోడి’ చిత్రంతో తమిళం(Tamil)లో అరంగేట్రం చేసి అద్భుత నటనతో ‘విజయ్ అవార్డు’ గెలుచుకుంది. ఆ తర్వాత విక్రమ్ వేధ, సందకోళి 2, సర్కార్, క్రాక్, వీరసింహారెడ్డి, హనుమాన్(Hanumaan) వంటి చిత్రాల్లోనూ విభిన్న పాత్రలు పోషించి అభిమానులను అలరించింది.
హాలీవుడ్ లెజెండరీ నటుడు జెరెమీ ఐరన్స్‌తో..
తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకుంది. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ‘Rizana- A Caged Bird’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా వరలక్ష్మి ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను టచ్ చేసేందుకు రెడీ అయింది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో వరలక్ష్మి హాలీవుడ్ లెజెండరీ నటుడు జెరెమీ ఐరన్స్(Hollywood legendary actor Jeremy Irons)తో కలిసి నటించనుండటం విశేషం. జెరెమీ ఐరన్స్ తన అద్భుతమైన నటనకు గాను పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
#Varalaxmi goes global! 🌍🎬@varusarath makes her Hollywood debut alongside Oscar-winner Jeremy Irons in #RIZANA – A Caged Bird 🕊️, directed by veteran Chandran Rutnam.
A powerful story, a dream collaboration! 💫 pic.twitter.com/l7E3Tpn8uv— Balaji (@RDBalaji) June 25, 2025
ముఖ్యమైన పాత్రలో విధుషికా రెడ్డి
ఈ సినిమాలో విధుషికా రెడ్డి(Vidhushika Reddy) కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీలంకకు చెందిన ప్రముఖ దర్శకుడు చంద్రన్ రత్నం(Chandan Ratnam) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా కథ రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం.’రిజానా- ఏ కేజ్డ్ బర్డ్’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శ్రీలంక(Srilanka)లోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. సుమతి స్టూడియోస్ బ్యానర్‌పై ప్రవీణ్, విధుషికా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster) విడుదల కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా(SM)లో వైరల్ అవుతున్నాయి.






