Mana Enadu : బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ప్రస్తుతం ‘బేబీ జాన్ (Baby John)’ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు. కీర్తి సురేశ్, వామికా గబ్బి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తాజాగా (Varun Dhawan) ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై ఎన్నో రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆ ఆరోపణలు ఏంటి..? దానిపై వరుణ్ ఏమన్నాడంటే..?
ఆ ఆరోపణలపై వరుణ్ క్లారిటీ
వరుణ్ ధావన్ ఒక ఈవెంట్‌లో ఆలియా భట్ (Alia Bhatt)ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడం, షూటింగ్‌లో కియారా అడ్వాణీని అందరిలో ముద్దు పెట్టుకున్నట్లు కొన్ని వీడియోలు గతంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నెట్టింట వరుణ్ పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. వరుణ్ తన కోస్టార్లతో మిస్ బిహేవ్ చేస్తాడంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ (Varun Dhawan) ఈ ఆరోపణలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
నేను అందరితో ఒకేలా ఉంటా
‘‘నేను సినిమా షూటింగ్ సమయంలో నా కోస్టార్స్ అందరితో ఒకేలా ఉంటాను. నా కోస్టార్స్ తో సరదాగా ఉంటాను. కానీ ఎవరూ ఎప్పుడూ నేను తప్పుగా బిహేవ్ చేస్తున్నానని నాతో చెప్పలేదు. మీరు ఇప్పుడు ఈ ప్రశ్నలు అడిగి మంచి పని చేశారు. ఇప్పటికైనా ఈ విషయంలో నాకు క్లారిటీ ఇచ్చే ఛాన్స్ దొరికింది. ముందు కియారా (Kiara Advani) విషయంలో ఏం జరిగిందో చెబుతాను.
అది మేం ప్లాన్ చేశాం
కియారాను అందరిలో నేను కావాలని కిస్ చేయలేదు. ఓ మేగజైన్ ఫొటోషూట్ లో భాగంగా అలా చేశాం. ఆ క్లిప్ ను నేను, కియారా మా సోషల్ మీడియాలోనూ షేర్ చేశాం. ఇదంతా ప్లాన్ చేసి చేసిందే. ఇక ఆలియా సంగతికి వస్తే తన నాకు మంచి ఫ్రెండ్. ఆరోజు సరదాగా అలా చేశానంతే కానీ కావాలని చేయలేదు. అది సరసాలాడటం కాదు. మేమిద్దరం ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్’’ అని వరుణ్ అసలు విషయం చెప్పుకొచ్చాడు.
ఇక ప్రస్తుతం వరుణ్ ‘బేబీ జాన్’తో ప్రేక్షకులను పలకరించాడు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాకు కథను అందించగా కాలీస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో కీర్తి సురేశ్ (Keerthy Suresh) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్ కీలకపాత్రలు పోషించగా.. సల్మాన్‌ఖాన్ అతిథి పాత్రలో కనిపించారు.






