
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ (Online Betting Apps) .. యువతను తప్పుదోవ పట్టించి వారిని వ్యవసనాలకు బానిసలుగా చేస్తున్నాయి. అయితే వీటిని ప్రమోట్ చేస్తూ అమాయక యువత వీటికి బానిసయ్యేలా చేస్తున్నారు కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు. బెట్టింగ్ కంపెనీల నుంచి లక్షల సొమ్ము తీసుకుని వాటిని ప్రమోట్ చేస్తూ యువత జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇలాంటి వారి బెండు తీసేందుకు రంగంలోకి దిగారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (Sajjanar VC). ఇప్పటికే ఇలాంటి యూట్యూబర్లను పలువురిని అరెస్టు చేశారు. బెట్టింగ్ యాప్స్ మాయ నుంచి యువతను బయటకు రప్పించేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
#SayNoToBettingApps @Cyberdost @AmitShah @narendramodi pic.twitter.com/zb1HYbXaKP
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 15, 2025
యూట్యూబర్లకు సజ్జనార్ టెర్రర్
నిత్యం సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ పై అవగాహన కల్పిస్తున్నారు సజ్జనార్ (Sajjanar on Betting Apps). అలాగే వీటిని ప్రమోట్ చేసి సొమ్ము చేసుకుంటున్న పలు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల బెండు తీస్తున్నారు. ఎక్కడికక్కడ వారిని ట్రేస్ చేస్తూ కేసులు ఫైల్ చేస్తున్నారు. ఇప్పటికే లోకల్ బాయ్, భయ్యా సన్నీ యాదవ్, యూట్యూబ్ హర్ష (You Tuber Harsha Sai) మీద కేసులు పెట్టి వారిని జైలుకు పంపారు. ఇక సజ్జనార్ టెర్రర్ తో కొంతమంది యూట్యూబర్లు ముందే సర్దేసుకుంటున్నారు. ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయమంటూ తప్పయిందని క్షమాపణలు చెబుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వీడియోలను తమ అకౌంట్ల నుంచి తొలగిస్తున్నారు.
చూశారా.. వీళ్ళు మనుగడ సాగించేందుకు వేరే ఆప్షన్ లేదంట. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడమే ఒక్కటే మార్గమట.
మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్.
ఎందరో బెట్టింగ్ కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా.. కండ్లుడి కూడా… pic.twitter.com/j9BOPznGdk
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 17, 2025
వీళ్లేమన్నా దేశాన్ని ఉద్ధరిస్తున్నారా?
‘భారత ఆర్థిక వ్యవస్థను, యువత బంగారు భవితను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్ (Betting Apps)లకు దూరంగా ఉండండి. కాసులకు కక్కుర్తి పడ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీసులకు ఫిర్యాదు చేయండి.’ అంటూ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా యువతకు పిలుపునిచ్చారు. ‘బెట్టింగ్ యాప్ లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్లు పోజులు కొడుతున్న వాళ్లనా మీరు ఫాలో అవుతుంది. వీరి స్వార్థం వల్లే బెట్టింగ్ మహమ్మారి సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారత ఆర్ధిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోంది. ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ ఫాలో కొట్టండి. వారి అకౌంట్ లను రిపోర్ట్ చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్ ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి.’ అంటూ అవగాహన కల్పిస్తున్నారు.
బెట్టింగ్ యాప్ లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్లు పోజులు కొడుతున్న ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతుంది.
వీరి స్వార్థం వల్లే బెట్టింగ్ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారత ఆర్ధిక వ్యవస్థను కూడా దెబ్బ… https://t.co/hUwPhOtPjP
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 16, 2025
నా అన్వేషణ అనే యూట్యూబర్ తో కలిసి అవగాహణ పెపొందేలా వీడియోలు చేస్తున్నారు సజ్జనార్. ఇప్పటికైనాబెట్టింగ్ యాప్స్ ప్రోమోట్ చేసే సైబర్ టెర్రరిస్టుల అకౌంట్స్ ను అన్ ఫాలో కొట్టండి. వారి అకౌంట్ లను రిపోర్ట్ చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్ ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయండని సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా సజ్జనార్ పూనుకున్న ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. ప్రజా ప్రయోజనాల కోసం యువత భవిత కోసం సజ్జనార్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసున్నారు.