తెలంగాణలో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్(Congress vs BRS) పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏ సభకు వెళ్లినా KCR, KTR, హరీశ్‌రావులపై BRS పాలనలో చేసిన తప్పులను ఎత్తిచూపుతూనే ఉన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, అంతులేని అవినీతి(Corruption) జరిగిందని ఇప్పటికే చాలా సార్లు సీఎం రేవంత్ ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్‌పై కేటీఆర్, హరీశ్‌రావులు ఎప్పటికప్పుడు రివర్స్ కౌంటర్(Reverse counter) ఇస్తూనే ఉన్నారు. గుంపు మేస్త్రి పనితనం మాటల్లో తప్ప ఇచ్చిన హామీల అమలులో లేదని గట్టిగానే సీఎం రేవంత్‌ని ఉద్దేశించి కాంగ్రెస్‌కు చురకలంటిస్తున్నారు.
మీరెంత.. నా కాలు గోటితో సమానం: సీఎం రేవంత్
ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్(Mahbubnagar) జిల్లాలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో CM మాట్లాడారు. ‘‘రైతులే మా అంబాసిడర్లు. తాను పుట్టింది. పెరిగింది నల్లమల్ల అడవుల్లో.. పులులను చూశా.. అడవిలో ఉండే మృగాలను చూశా. అన్నింటినీ ఎదుర్కొని ఇంత దూరం వచ్చా. మానవ మృగాలు మీరెంత.. నా కాలు గోటితో సమానం’’ అంటూ రేవంత్ రెడ్డి పరోక్షంగా BRS నేతలపై హాట్ కామెంట్స్(Hot comments) చేశారు. అంతటి ఆగకుండా మాజీ సీఎం KCR 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్(KCR Farm house) కట్టుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, MLA వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు.
లేకుంటే ముక్కు నేలకు రాస్తావా?: ఎమ్మెల్యే వేముల
తెలంగాణలోని రైతులకు రైతుబంధును ఎగ్గొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తుందని BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashant Reddy)మండిపడ్డారు.CM రేవంత్ రెడ్డి గ్రాఫ్(Graph) పడిపోయిందని చెప్పారు. ఇక మాజీ సీఎం కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు.KCRకు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే.. తాను రాజీనామా చేస్తానని.. లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి ఇంటికి పోతావా? అని సవాల్ విసిరారు. తనతో వస్తే.. కేసీఆర్ ఫామ్ హౌస్‌ను చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చారు ప్రశాంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా స్పందింస్తుందో మరి.
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ @ నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం
రేవంత్ రెడ్డి బై డిఫాల్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు.
ఫ్రస్టేషన్లో పరేషాన్ లో నిన్న మహబూబ్ నగర్ మీటింగ్ లో ఏమేమో మాట్లాడుతున్నాడు.
అధికారం చేపట్టిన సంవత్సరం లోనే ఈ దేశం లోనే… pic.twitter.com/LW3yRkhWPr
— Vemula Prashanth Reddy (@VPR_BRS) December 1, 2024