సెలబ్రిటీ జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి (Venu Swamy) గురించి తెలియని వారుండరు. ఎప్పుడూ సెలబ్రిటీల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడుతుంటాడు. గతంలో నాగచైతన్య, సమంత (Samantha) విడిపోతారంటూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇటీవల చైతన్య, శోభిత కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరంటూ మరో బాంబ్ పేల్చాడు. అయితే అక్కినేని ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేయడం.. ఫిలిం జర్నలిస్టులు ఫిర్యాదు చేయడంతో కాస్త వెనక్కితగ్గాడు.
View this post on Instagram
ఆ ముగ్గురు చనిపోతారు
ఇక ఎవరి జాతకాలు చెప్పనంటూ ఓ వీడియో (Venu Swamy Video) రీలీజ్ చేశాడు. కానీ తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వేణుస్వామి ముగ్గురు సినిమా సెలబ్రిటీల గురించి సంచలన కామెంట్స్ చేశాడు. వాళ్లు ముగ్గురు చనిపోతారంటూ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశాడు. అందులో ఇద్దరు సూసైడ్ చేసుకుంటారని, మరొకరు తీవ్రంగా గాయపడి చనిపోతారంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అలా ముగ్గురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
View this post on Instagram
అతడు తీవ్రంగా గాయపడతాడు
ఆ వీడియోలో వేణుస్వామి మాట్లాడుతూ.. జ్యోతిష్యం ప్రకారం సమంత, విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)లలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం ఖాయమని అన్నాడు. అయితే లెక్క ప్రకారమైతే విజయ్ సూసైడ్ చేసుకుంటాడని చెప్పాడు. ఇక మరో హీరోకు తీవ్రమైన గాయం అవుతుందని తెలిపాడు. అయితే ఆ హీరో ఎవరని అడిగితే.. డైరెక్టుగా పేరు చెప్పకుండా.. అతడికి మొత్తం సమస్యలే అంటూ దాటవేశాడు. అయితే అందుకే రాజాసాబ్ రిలీజ్ కూడా వాయిదా పడుతూ వస్తుందని వేణుస్వామి చెప్పడంతో ఆయన మాట్లాడేది ప్రభాస్ (Prabhas) గురించేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలా సెలబ్రిటీల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వారి కుటుంబాలు ఆందోళన చెందుతారంటూ నెటిజన్లు వేణుస్వామిపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.






