టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్(Venkatesh), ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో తెరకెక్కన మూవీ ‘సంక్రాతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam)’. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్లో విడుదలై పాజిటివ్ టాక్(Positive Talk) సొంతం చేసుకుంది. ఇక కాసేపట్లో తెలుగురాష్ట్రాల్లోనూ ఈ మూవీ సందడి చేయనుంది. కంప్లీట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్(A fun and family entertainer)గా అనిల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందించంగా, శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు(Dil Raju నిర్మించారు.ఇక ఈ మూవీ నుంచి వచ్చిన ‘గోదారి గట్టుమీద’ అంటూ సింగర్ రమణ గోగుల(Ramana Gogula) పాడిన పాటకు ఫుల్ క్రేజ్ వచ్చింది. రిలీజైనప్పటి నుంచి ఈ పాట దుమ్మురేపుతోంది. ఇప్పటికే 100M వ్యూస్ దాటేసింది. అటు మూవీ ప్రమోషన్ల(Promotions)లోనూ చిత్రయూనిట్ దుమ్మురేపింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్లో ఇంప్రెస్ చేసిందో తెలియాంటే ఈ ట్విటర్ రివ్యూ(Twitter Review) చూడాల్సిందే..
అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అదిరిపోయింది
‘హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్(Family Background)తో వచ్చిన ప్రతిసారీ విక్టరీయే’-‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) ట్రైలర్ చివర్లో వచ్చిన డైలాగ్. అది నిజమేనని సోషల్ మీడియా(SM)లో టాక్ చూస్తుంటే అర్థం అవుతోంది. ‘F2’ తరహాలో తన టిపికల్ మార్క్ కామెడీతో అనిల్ రావిపూడి సినిమా తీశారట. చాలా వరకు కామెడీ వర్కౌట్ అయిందని మెజారిటీ జనాలు చెబుతున్నారు. కథ పెద్దగా లేదని ఈ సినిమాకు కామెడీ(Comedy) హైలైట్ అని లాజిక్స్ వంటివి పట్టించుకుంటే అసలు ఎంటర్టైన్ కాలేరని టాక్. ‘హాయ్’కు ఈ సినిమాలో కొత్త మీనింగ్ ఇచ్చారట. ఇక ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని ఏకైక లక్ష్యంతో థియేటర్లలోకి వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం అని ఓ NRI పేర్కొన్నారు.
Sankranthiki Vasthunam movie review! #Venkateshdaggubati #SankranthikiVasthunam #telugumovie #TeluguCinema #MovieReview #victoryvenkatesh pic.twitter.com/tRzFyK3PzR
— Sudheer Manne (@sudheervlogger) January 14, 2025
పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
మరికొందరు సంక్రాంతికి ఈ సినిమాను కచ్చితంగా ఫ్యామిలీతో చూడమని ఆల్రెడీ చూసిన ప్రేక్షకులు రికమెండ్ చేస్తున్నారు. కొందరు ప్రేక్షకులు మాత్రం ఈ మూవీ యావరేజ్‌గా ఉందంటూ యావరేజ్ రేటింగ్ ఇస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్(Secondoff) చాలా బాగుందంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.
One word: HITTU CINEMA. #SankranthikiVasthunam
You will laugh loudly many times in the theatre. You will leave with a smile, remembering YD Raju, Bulli Raju, and their family. https://t.co/VuhhFcQyzw— Telugu Cinema Dot (@telugucinemadot) January 13, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’లో చిన్న చిన్న తప్పులు ఉన్నా.. ఇది మాత్రం పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మరికొందరు అంటున్నారు. వెంకీ మామతో పాటు ఐశ్వర్య రాజేశ్ నటన కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ అని ప్రశంసిస్తున్నారు. రమణ గోగుల పాడిన ‘గోదారి గట్టుమీద సాంగ్’ సూపర్‌గా ఉందని కొనియాడుతున్నారు. మరికాసేపట్లో ‘మనఈనాడు’ ఫుల్ రివ్యూ..
#SankranthikiVasthunam – Sankranthi Winner🏆#Venkatesh #AishwaryaRajesh #MeenakshiChaudhary #AnilRavipudi #Dilraju #Cinee_WorlddReview #Cinee_Worldd @VenkyMama @aishu_dil @Meenakshiioffl @AnilRavipudi @SVC_official pic.twitter.com/LQIxl6K7UT
— cinee worldd (@Cinee_Worldd) January 14, 2025







