భిన్నమైన స్క్రిప్ట్స్ ఎంచుకొని తన యాక్టింగ్‌తో ఆ పాత్రకు ప్రాణం పోస్తారు నటి విద్యాబాలన్ (Vidya Balan). డర్టీ పిక్చర్తో తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించి ఆశ్చర్యపరిచారు. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో అవమానాలు, చేదు అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. రాత్రి రాత్రే 9 ప్రాజెక్టుల్లో నుంచి తనను తీసేశారని, ఐరెన్ లెగ్ అనే ముద్ర వేశారని అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.
ఆ మూవీ ఆగిపోవడానికి కారణం నేను కాదు
‘మలయాళ టాప్ హీరో మోహన్‌లాల్‌తో (Mohanlal) కలిసి ‘చక్రం’ అనే మూవీకి సైన్ చేశాను. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. కానీ అనూహ్యంగా ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ సినిమా ఆగిపోవడానికి నేనే కారణమని ప్రచారం జరిగింది. నన్ను ‘ఐరెన్ లెగ్’ అని అన్నారు. నేను సంతకం చేసిన 9 దక్షిణాది ప్రాజెక్ట్‌ల నుంచి నన్ను రాత్రికి రాత్రే తొలగించారు’ అని పేర్కొన్నారు. ఆ సినిమా ఆగిపోవడానికి కారణం తాను కాదని.. మోహన్‌లాల్‌కు, దర్శకుడికి అభిప్రాయ భేదాల వల్ల అది ఆగిపోయిందని విద్యాబాలన్ పేర్కొన్నారు.
నాపై నేను నమ్మకం కోల్పోలేదు
‘ఈ పరిణామాల ప్రభావం నా కెరీర్‌పై పడింది. ఆ సినిమా విజయం సాధిస్తే హీరోయిన్గా నిలుదొక్కుకుంటానని భావించాను. నా తల్లిదండ్రులు కూడా దేవుడిని ప్రార్థించారు. కానీ అర్ధాంతరంగా ఆ సినిమా ఆగిపోయింది. నా తదుపరి సినిమాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. కానీ నాపై నేను నమ్మకాన్ని కోల్పోలేదు. కెరీర్ ప్రారంభంలో అమితాబ్ బచ్చన్ కూడా తిరస్కరణలకు గురయ్యారని గుర్తుచేసుకొని ముందుకుసాగాను. అన్నింటినీ అధిగమించి ఈరోజు ఈ స్థాయిలో నిలిచాను’ అని పేర్కొన్నారు.
Vidya Balan opens up about a tough phase in her career — losing 8–9 South films after being unfairly labelled a jinx post a shelved Mohanlal movie. 🎬💔
From rejection to reinvention, her journey is pure resilience! 👏#VidyaBalan #SouthCinema #Bollywood #Inspiration #Throwback pic.twitter.com/hNGdvYitwm— Bollywood Masti (@bollymastivilla) July 10, 2025






