
‘బిచ్చగాడు’ మూవీతో తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడైన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించిన కొత్త మూవీ ‘మార్గన్’ (Maargan) ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పొలిటికల్ ఎంట్రీపైనా మాట్లాడారు. రాజకీయాలపై తనకు పెద్దగా అవగాహన లేదన్నారు. కేవలం ఫేమ్ ఉంది కదా అని రాజకీయాల్లోకి రాలేమన్నారు. ‘‘రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నటీనటులు ఏదోఒక సమయంలో తప్పకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే రూల్ ఏమీ లేదు కదా. సేవ చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా అడుగుపెట్టినా.. వారికి పూర్తిస్థాయిలో ప్రజల మద్దతు ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడే అధికారంలోకి రాగలరు. నిజం చెప్పాలంటే, నాకు రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదు. ఫేమ్ ఉందని రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి లేదు. ముందు ప్రజల సమస్యలను అర్థం చేసుకోగలగాలి’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు.
మత్తు పదార్థాలకు చాలామంది బానిసలవుతున్నారు
డ్రగ్స్ కేసులో తమిళ, తెలుగు నటుడు శ్రీరామ్ (Sriram) అరెస్ట్ పైనా విజయ్ మాట్లాడారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం కొత్తేమీ కాదన్నారు. ఎంతోకాలంగా చిత్ర పరిశ్రమలో ఈ సమస్య ఉందన్నారు. మత్తు పదార్థాలకు చాలామంది బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో శ్రీకాంత్‌కు సంబంధించిన కేసు దర్యాప్తులో ఉందని, దీనిలో నిజానిజాలు త్వరలోనే బహిర్గతమవుతాయని పేర్కొన్నారు.
Vijay Antony on Drugs | திரையுலகில் நீண்ட காலமாக போதைப் பொருள் பயன்பாடு இருக்கு | விஜய் ஆண்டனி | Maalaimalar #VijayAntony #DrugUseInCinema #KollywoodNews #FilmIndustryTruth #VijayAntonySpeech #CinemaControversy #Maalaimalar #TamilCinema #DrugAwareness #EntertainmentNews… pic.twitter.com/sp3w1POWz4
— Maalai Malar தமிழ் (@maalaimalar) June 25, 2025
మార్గన్‌లో విలన్‌గా ఆంటోనీ మేనల్లుడు
విజయ్ ఆంటోనీ (Vijay Antony) లేటెస్ట్ మూవీ ‘మార్గన్’ (Maargan) ఈనెల 27న ఈ సినిమా విడుదల కానుంది. లియో జాన్‌పాల్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాతో ఆయన మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్‌గా పరిచయమవుతున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సముద్రఖని (Samuthirakani), దీప్షిక (Deepshikha) తదితరులు కీలక పాత్రలు పోషించారు.