
టాలీవుడ్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కింగ్‌డమ్(Kingdom)” సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఇవాళ (జులై 31) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్(Satyadev) కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు బలం. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ ద్వారా భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ అభిమానులను అలరించిందా? లేదా? సూరి పాత్రలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది?
స్టోరీ ఏంటంటే..
కథలో విజయ్ దేవరకొండ సూరి పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా, అండర్‌కవర్ ఆపరేషన్(Undercover Operation)లో భాగంగా శ్రీలంక(Srilanka) నేపథ్యంలో ఒక క్రిమినల్ సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ తన అన్న (సత్యదేవ్) ఉన్నట్లు తెలుసుకుని, అతని గతం, కుట్రలను వెలికితీసే క్రమంలో భావోద్వేగాలు, యాక్షన్(Action)తో కథ సాగుతుంది. ట్రైలర్‌లో చూపిన రివెంజ్ డ్రామా, అన్నదమ్ముల అనుబంధం సినిమాకు హైలైట్. విజయ్ దేవరకొండ నటన శక్తిమంతంగా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లో అతని ఎనర్జీ, ఎమోషనల్ సీన్స్‌లో డెప్త్ ఆకట్టుకుంటుంది. భాగ్యశ్రీ(BhagyaSri Borse) రొమాంటిక్ ట్రాక్‌లో మెరిసింది, కానీ ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు.
అన్న పాత్రతో ఆకట్టుకున్న సత్యదేవ్
ఇక సత్యదేవ్ తన పాత్రలో చక్కగా నటించాడు. అనిరుధ్(Anirudh) సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు జోష్ తెచ్చాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఉన్నతంగా ఉన్నాయి. అయితే, కథ కొంత ఊహించినట్టే సాగడం, కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించడం సినిమాకు మైనస్. 2 గంటల 40 నిమిషాల రన్‌టైమ్‌లో కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. US ప్రీమియర్ షోల నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ కథలో కొత్తదనం కొరవడిందని కొందరు విమర్శిస్తున్నారు. మొత్తంగా, ‘కింగ్‌డమ్’ విజయ్ అభిమానులకు, యాక్షన్, ఎమోషనల్ డ్రామా ఇష్టపడేవారికి ఓ మంచి వినోదం.
రేటింగ్: 2.75/5