
డెంగ్యూ జ్వరం(Dengue fever)తో ఆసుపత్రిలో చేరిన చికిత్స పొందిన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు మూడు రోజుల పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉన్నట్లు సమాచారం. కాగా జులై 31న విడుదల కానున్న తన రాబోయే చిత్రం ‘కింగ్‌డమ్(Kingdom)’ ప్రమోషన్స్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురవడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. విజయ్‌కు జ్వరం, అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరగా, అక్కడ డెంగ్యూ నిర్ధారణ అయింది. మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన ఆయన, ఆరోగ్యం మెరుగైన తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. వైద్యులు విజయ్‌కు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, ఆయన తన సినిమాకు ప్రమోషన్స్(Kongdom Promotions) చేసుకునేందుకు రెడీ అయ్యారు.
🚨 🚨 #BreakingNews Vijay Deverakonda discharged from hospital after recovering from dengue ahead of Kingdom release; actor’s team confirms https://t.co/Dk0GL8bJ5z
Click here for best #amazon deals: https://t.co/WH6io9nrWX#TrendingNews #BigBreaking
— Instant News ™ (@InstaBharat) July 23, 2025
స్పై యాక్షన్ డ్రామాగా కింగ్‌డమ్
ఇప్పటికే ‘కింగ్‌డమ్’ కోసం కొన్ని ప్రమోషనల్ వీడియోలను చిత్రీకరించారు. త్వరలో తెలుగులో ఇంటర్వ్యూలతో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ స్పై యాక్షన్ డ్రామా చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వం వహించారు. ఇందులో భాగ్యశ్రీ భోర్సే(Bhagyashree Bhorse), సత్యదేవ్(Satyadev) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫార్చూన్ 4 సినిమాస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై సాయిసౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఈనెల 28న సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్
కాగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ జులై 26న విడుదల కానుంది. జులై 28న సినిమా ప్రీ-రిలీజ్ వేడుక(Pre-release event) ఉంది. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ హాజరు కానున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో #VijayDeverakonda హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సందేశాలు పంచుకున్నారు. విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రాలైన ‘VD14’తోపాటు ‘SVC59’తో బిజీగా ఉన్నారు.