
టాలీవుడ్ రౌడీబాయ్, హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) వరుస మూవీలతో ఫుల్ బిబీబిజీగా ఉన్నాడు. ప్రజెంట్ విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్(Kingdom)’. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీలో రుక్మిణీ వసంత్(Rukmini Vasanth), భాగ్య శ్రీ బోర్సే(Bhagyashri Borse) హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరిలో ఈ మూవీ టీజర్(Teaser) విడుదల కాగా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
ఇక ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడుతో కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ మూవీ నుంచి టీజర్ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉంటే తాజగా ‘కింగ్‌డమ్’ మూవీకి సంబంధించిన ఓ పోస్ట్(Post) నెట్టింట వైరల్ అవుతోంది.
#Kingdom త్వరలో ఫస్ట్ సింగిల్…
ఈ వారం అనుకున్నారు.. కానీ వచ్చే వారం ఉండొచ్చు !
A #Anirudh Musical 🎹
— Rajesh Manne (@rajeshmanne1) April 9, 2025
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వచ్చే వారం విడుదల కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ట్వీట్(Tweet) వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్రాన్ని వేసవిలో మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అటు విజయ్ తాజాగా తన ట్విటర్ హ్యాండిల్‌లో 50 Days To Go #KINGDOM అని రాయడంతో రౌడీబాయ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
50 Days To Go #KINGDOM 💥#DailyDosageOfKingdom pic.twitter.com/CJLKOCikBW
— 𝐕𝐃’𝐬 𝐊𝐈𝐍𝐆𝐃𝐎𝐌👑 (@VDK_cultFan) April 9, 2025