Kingdom Trailer Event: ఈ రెండూ నాతో ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపేదేలే: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘కింగ్డమ్‌’ ట్రైలర్(Kingdom Trailer) లాంచ్ ఈవెంట్ తిరుపతి(Tirupathi)లోని నెహ్రూ మైదానంలో ఘనంగా జరిగింది. జులై 31న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌(Promotions)లో భాగంగా నిర్వహించిన ఈ ఈవెంట్‌లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగ వంశీ కూడా పాల్గొన్నారు. కాగా రాత్రి 10.42 గంటలకు ‘కింగ్డమ్‌’ ట్రైలర్‌ విడుదలైంది. కాగా ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ రాయలసీమ యాస(Rayalaseema dialect)లో మాట్లాడి అభిమానులను ఉర్రూతలూగించారు.

Kingdom: Vijay Deverakonda Film's Trailer To Be Launched On THIS Date;  Makers Share Intriguing Poster | Telugu - Times Now

ఎప్పట్లాగే ప్రాణం పెట్టి గట్టిగా పనిచేశా..

‘‘ఏమీ ఎట్లా ఉండారు అందరూ.. బావుండారా? బావుండాలి.. అందరూ బావుండాలి. అందరం బావుండాలి. ఈ తూరి నేరుగా మీకాడికే వచ్చొనాము. మీ అందర్ని కలిసనము. మీ అందరితో కలిసి ట్రైలర్ చూసినము. మీ అరుపులు, కేకలు వింటాంటే సాన సాన సంతోషంగా అనిపిస్తాందప్పా’’ అని విజయ్ వ్యాఖ్యానించాడు. ఇంకా ఏమన్నాడంటే.. ‘‘గత ఏడాది నుంచి ‘కింగ్డమ్‌’ సినిమా విడుదల గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో ఒక్కటే అనిపించింది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్నస్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్కనుండి నన్ను నడిపించారో, చాలా పెద్దోడిని అవుతాను. పోయి టాప్‌లో కూర్చుంటా. ఎప్పట్లాగే ప్రాణం పెట్టి గట్టిగా పనిచేశా. ఈసారి నా సినిమాని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. తన సంగీతంతో అనిరుధ్‌ పగలగొట్టాడు. దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ఎడిటర్‌ నవీన్‌ నూలి, కథానాయిక భాగ్యశ్రీ అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు, పనిచేస్తూనే ఉన్నారు. ఇక మిగిలింది రెండే. ఆ వెంకన్నస్వామి దయ, ప్రేక్షకుల ఆశీసులు. ఈ రెండూ నాతో ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపేదేలే’’ అని అనడంతో ఫ్యాన్స్ కేరింతలతో సందడి చేశారు.

మరో 4 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు..

కాగా నిజానికి ఈ సినిమా మే 30న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఈ సినిమా జులై 31న రిలీజ్ కాబోతుంది. అంటే మరో 4 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేట షురూ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకున్న హైప్ చూస్తుంటే.. రిలీజ్ తర్వాత రికార్డులు తిరగరాసేలానే కనిపిస్తుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు(Censor board) నుంచి U/A సర్టిఫికేట్ వచ్చింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కుల(Ott Rights)ను నెట్‌ఫ్లిక్స్(Netflix) పెద్ద మొత్తానికి కొనుగోలు చేసింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *