డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వెట్రిమారన్ అండ్ మక్కళ్ సెల్వన్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ మీట్‌లో విజయ్ సేతుపతిని సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మీరు నక్సలిజాన్ని ప్రమోట్ చేస్తున్నట్టనిపిస్తుంది.. దీనికి సెన్సార్ అభ్యంతరాలేమి రాలేదా.. ? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి విజయ్ సేతుపతి స్పందిస్తూ.. సార్ ఫస్ట్ సినిమా చూడండి.. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నేను సినిమా గురించి మాట్లాడుతా.. అప్పుడు కథ గురించి చెబుతా. కానీ మీరు సినిమా చూడాలని సూచించాడు.
కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ (Vetri Maaran) కాంపౌండ్ నుంచి వస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్ విడుదల పార్ట్ 2 (Vidudhala Part 2). విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లీడ్ రోల్‌లో వస్తోన్న ఈ చిత్రంలో సూరి మరో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మంజు వారియర్ (Manju Warrier) ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
వెనుక బడిన ప్రజల కోసం పోరాడే పెరుమాళ్ స్టోరీగా.. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా కోసం రియలిస్టిక్‌గా ఉండేలా వెట్రిమారన్ ప్రత్యేకంగా ఊరినే సృష్టించాడు. నిజంగానే ఊరు ఇప్పటికే ఉన్నదా అన్నట్టుగా అనిపించే మేకింగ్ వీడియో ఇప్పుడు సినిమాపై హైప్ మరింత పెంచేస్తుంది.
The talented #ManjuWarrier mesmerized everyone with her beautiful rendition at the #Vidudhala2 press meet. 🎶#Vidudala2PressMeet#VidudalaPart2FromDec20#ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/iNSqjd3wrb
— Shreyas Media (@shreyasgroup) December 15, 2024






