Mana Enadu : తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ (Vijay) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గోట్’ (The Goat). వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఫిల్మ్ సెప్టెంబరు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. ఈ క్రమంలోనే నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
అక్టోబర్ 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ది గోట్ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ పోస్టర్ విడుదల చేసింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక విజయ్ సరసన స్నేహ, మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) నటించారు. ఈ సినిమాలో త్రిష అతిథిగా ఓ పాటలో కనిపించి అలరించింది. ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ కీలక పాత్రల్లో సందడి చేశారు.
Ever seen a lion become a G.O.A.T?!
,#ThalapathyVijay’s The G.O.A.T- The Greatest Of All Time is coming to Netflix on 3 October in Tamil, Telugu, Malayalam, Kannada & Hindi #TheGOATOnNetflix pic.twitter.com/091KXkQTo4
— The GOAT Movie (@GoatMovie2024) October 1, 2024
ది గోట్ స్టోరీ ఏంటంటే?
స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ బృందంలో ఏజెంట్‌లా పని చేస్తుంటాడు గాంధీ (విజయ్). తన ఉద్యోగం గురించి భార్య అను (స్నేహ)కు తెలియదు. తనొకసారి ఓ మిషన్ కోసం థాయ్ ల్యాండ్ వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ మిషన్ వల్ల గాంధీ కుటుంబానికి ఎదురైన ఓ ముప్పు వల్ల తన ఐదేళ్ల కొడుకు జీవన్‌ను కోల్పోతాడు. తన వల్లే కొడుకును కోల్పోవాల్సి వచ్చిందన్న బాధతో ఉద్యోగం వదిలేస్తాడు.
15 ఏళ్ల తర్వాత ఓసారి ఓ పని విషయమై మాస్కోకి వెళ్లిన గాంధీకి అనూహ్యంగా తన కొడుకు జీవన్ (Vijay) కనిపిస్తాడు. అలా కొడుకు రాకతో గాంధీ కుటుంబం మళ్లీ కలుస్తుంది. అంతా బాగుందనుకున్న సమయంలో గాంధీ స్క్వాడ్ టీమ్‌లో ఒక్కొక్కరూ వరుసగా హత్యకు గురవుతుంటారు. ఈ హత్యలకు కారణమెవరు? జీవన్‌కు, ఈ హత్యలకూ ఉన్న లింకేంటి? తను తండ్రిని చంపాలని ఎందుకు పగబడతాడు? జీవన్‌ను పెంచి పెద్ద చేసిన మేనన్ (మోహన్)కు.. గాంధీకి ఉన్న గొడవ ఏంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.






