నేటి నుంచి అమల్లోకి PM e-Drive స్కీమ్- వాహనాలపై భారీ డిస్కౌంట్స్

Mana Enadu : ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఈ వాహనాలపై భారీ డిస్కౌంట్లు అందించేందుకు సరికొత్త పథకం పీఎం ఇ-డ్రైవ్‌ అమల్లోకి తీసుకువచ్చింది. ఇవాళ్టి (అక్టోబర్ 1 2024) నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, ఈవీ ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.10,900 కోట్లతో తీసుకొస్తున్న ఈ పథకం 2024 అక్టోబర్‌ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమల్లో ఉండనుంది.

రాయితీ గల వాహనాలు ఇవే

పీఎం ఇ- డ్రైవ్‌ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్‌ టూ వీలర్లు, త్రీ- వీలర్లు, ఇ- అంబులెన్సులు, ఇ-ట్రక్కులకు కేంద్ర సర్కార్ డిస్కౌంట్ కల్పిస్తుంది. ఈ పథకం అమల్లో ఉండనున్న రెండేళ్ల కాలంలో బస్సులకు అత్యధికంగా రూ.4,391 కోట్లు .. టూ- వీలర్లకు రూ.1772 కోట్లు వెచ్చించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్‌ టూ- వీలర్‌, త్రీ- వీలర్‌ కేటగిరీకి కిలోవాట్‌కు రూ.5,000, ఆ మరుసటి ఏడాది రూ.2,500.. 2024-25లో ఎలక్ట్రిక్‌ టూ-వీలర్ కు గరిష్ఠంగా రూ.10వేలు, ఇ- రిక్షాకు రూ.25వేలు చొప్పున గరిష్ఠంగా చెల్లించనుంది. ఆ మరుసటి ఏడాది 2025-26లో టూ- వీలర్‌కు రూ.5 వేలు, ఇ-రిక్షాలకు రూ.12,500 చొప్పున డిస్కౌంట్ లభిస్తుంది.

రెండేళ్ల పాటు అమల్లో

మొదటి సారిగా 2015 ఏప్రిల్‌ 1న ఈ పథకాన్ని ప్రారంభించారు. రెండేళ్ల పాటు అమల్లో ఉన్న ఈ స్కీమ్ తిరిగి 2019 ఏప్రిల్‌ 1న పునఃప్రారంభమైంది. 2024 మార్చి 31 వరకు అమల్లో ఉంది. ఆ తర్వాత ఎలక్ట్రిక్‌ టూవీలర్‌, త్రీవీలర్లకు మద్దతు ఇచ్చేందుకు మధ్యలో ఎలక్ట్రిక్‌ మొబలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ 2024ను ప్రకటించారు. ఈ స్కీమ్‌ సెప్టెంబర్‌తో 30తో ముగియగా.. అక్టోబర్ 1వ తేదీ నుంచి మరో రెండళ్ల పాటు పీఎం ఇ-డ్రైవ్‌ పథకం అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర సర్కార్.

Share post:

లేటెస్ట్