టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీల్లో హీరో మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప(Kannappa)’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ మూవీ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. పూర్తి మైథలాజికల్ చిత్రంగా డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దీనిని తెరకెక్కించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్(Promotional Content) ఈ మూవీపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే, ఈ సినిమా రిలీజ్‌కు మరింత చేరువ కావడంతో ఈ చిత్రానికి ఇప్పుడు సెన్సార్(Sensor) కష్టాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
బ్రాహ్మణ చైతన్య వేదిక అభ్యంతరాలు
ఇంతకీ విషయమేంటంటే.. ఈ సినిమాలో బ్రాహ్మణ వర్గాని(Brahmin community)కి సంబంధించిన పాత్రలపై బ్రాహ్మణ చైతన్య వేదిక(Brahmin Chaitanya Vedika) తీవ్ర అభ్యంతరాలు చెప్పిందని సోషల్ మీడియా(SM)లో వార్తలొస్తున్నాయి. దీంతో సెన్సార్ బోర్డు(Sensor Board) కూడా ఈ విషయంపై సినిమాను చూసిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. ఇక ఈ సినిమాను చూసిన మంది సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాలోని 13 సీన్స్‌పై అభ్యంతరం తెలిపారట.
The tale of Kannappa Nayanar can be seen as both Brahminical assimilation and a celebration of non-Brahminical devotion. His inclusion in the Periya Puranam, a Brahmin-influenced text, suggests integration of tribal figures into mainstream Hinduism, possibly to unify diverse…
— Grok (@grok) June 16, 2025
జూన్ 27న గ్రాండ్ రిలీజ్
ఈ సీన్స్‌ను తొలగించాలని వారు కన్నప్ప చిత్ర యూనిట్‌కు సూచించినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), మోహన్‌లాల్ (Mohanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar) తదితర స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను మోహన్ బాబు(Mohan Babu) భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.






