మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వశిష్ట డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’(Vishwambara) చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇందులో చిరుకు జోడీగా త్రిష మరియు ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. ఈ సినిమా 2025లో విడుదల కానుందని టాక్. షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో మరో చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. పూర్తిగా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి చిరంజీవి ఎనర్జీ కలిస్తే, మరో బ్లాక్‌బస్టర్ ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.
వీటితో పాటు మరొక చిత్రం దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో చేయబోతున్నాడు చిరు. సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్, నాన్నకు ప్రేమతో మరియు రంగస్థలం వంటి చిత్రాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి, 2023లో నాని హీరోగా దసరా సినిమాతో డైరెక్టర్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.
View this post on Instagram
ఇప్పుడు శ్రీకాంత్.. నానితో ప్యారడైజ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. అదే సమయంలో చిరంజీవితో కూడా ఓ సినిమాను లైన్‌లో పెట్టాడు. ఈ చిత్రం గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా పూర్తిగా డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కనుందని, ఇందులో చిరంజీవి ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నారని టాక్. అంతేకాకుండా, ఈ సినిమాలో హీరోయిన్ ఉండదనీ, పాటలకూ కూడా ఉండవనీ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ వార్తలో నిజమెంత అనేది అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.






