ప్రైవేట్ జెట్‌ కొన్న సీరియల్ నటి? ఫోటోలు వైరల్..

సీరియల్ నటీనటులు కూడా సినీ తారల స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న తారలు, తమ అభినయం, అందంతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ తమ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో సీరియల్ నటి ఆయేషా ఒకరు.

తెలుగులో సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయేషా, తర్వాత తమిళంలో పలు సీరియల్స్ చేస్తూ కెరీర్ కొనసాగించింది. ఇటీవల జీ తమిళంలో ప్రసారం అయినా సూపర్ క్వీన్ షోలో కూడా పాల్గొంది. ప్రస్తుతం ఆమె తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లాయర్ అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

ఇటీవల ఆయేషా షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రైవేట్ జెట్‌లో కూర్చుని స్టైలిష్‌గా ఫోటోలకు పోజులిచ్చిన ఆమె ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో “ఆయేషా నిజంగానే ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసిందా?” అనే చర్చలు ప్రారంభమయ్యాయి.

 

View this post on Instagram

 

A post shared by AYSHA🦋 (@aysha7__official)

ఈ విషయంపై అధికారిక సమాచారం ఏదీ బయటకు రాకపోయినా, కొందరు అభిమానులు ఇది ఆమె సొంత విమానమనే అంటున్నారు. మరికొందరు ఇది ఆమె ఫోటోషూట్ కోసం మాత్రమే ఫోజులిచ్చింది అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయేషా తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తుంటుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *