Vishwambhara : VFX కోసమే రూ.75 కోట్లు.. వేరే లెవెల్ లో మెగా ప్లాన్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘విశ్వంభర (Vishwambhara)’. బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా అప్డేట్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సినిమా అంటేనే భారీగా గ్రాఫిక్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రంలోనూ మేకర్స్ భారీగా వీఎఫ్‌ ఎక్స్ వాడుతున్నట్టు సమాచారం.

వీఎఫ్ఎక్స్ కోసం భారీ ఖర్చు

అయితే విశ్వంభర సినిమాలో కేవలం వీఎఫ్‌ఎక్స్ (Vishwambhara VFX) కోసమే రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది.  హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ప్రముఖ వీఎఫ్ ఎక్స్ కంపెనీతో మేకర్స్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. కేవలం వీఎఫ్‌ ఎక్స్ కే ఇంత భారీగా ఖర్చు చేస్తుండటంతో  సినిమాలో గ్రాఫిక్స్ ఏ రేంజులో ఉంటాయో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు అంటున్నారు. వీఎఫ్ఎక్స్ బాగా వస్తేనే సినిమా బాగా ఆడుతుందని భావిస్తున్నారు.

వీఎఫ్ఎక్స్ వల్లే ఆలస్యం

ఇక ఈ సినిమాలో రియల్ సీన్స్ కంటే ఎక్కువ వీఎఫ్ఎక్స్ సీన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ దాదాపు చివరకు వచ్చేసింది. జులై నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వీఎఫ్‌ఎక్స్ వల్లే ఆలస్యం అయినట్లు తెలిసింది. ఇక ఇటీవల ఈ చిత్రం నుంచి రామ రామ అనే పాటను కూడా రిలీజ్ చేసింది. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా షురూ చేయనున్నట్లు సమాచారం. ఇందులో చిరు సరసన త్రిష (Trisha) నటిస్తోంది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *