
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. ఆరుపదుల వయసులోనూ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా అదే ఉత్సాహంతో నటిస్తున్నారు. వరుసబెట్టి మరీ సినిమాలు చేసేస్తున్నారు. అటు ఆయన వేసే స్టెప్పులకూ తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లాడి(Vasistha Malladi) డైరెక్షన్‌లో ‘విశ్వంభర(Vishwambhara)’ అనే మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్(Teaser) అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. షూటింగ్ చివరకు రావడంతో తాజాగా ఈ సినిమా నుంచి చిరు లుక్(Look)ని రివీల్ చేశారు మేకర్స్..
చాలా యంగ్ అండ్ స్టైలిష్‌గా..
తాజా ఫొటోలో చిరంజీవి వింటేజ్ లుక్(Vintage look)లో మెరిసిపోతున్నారు. చాలా యంగ్‌గా, స్టైలిష్(Stylish)గా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు క్షణాల్లోనే సోషల్ మీడియా(SM)లో వైరల్ అయిపోతున్నాయి. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ తెగ షేరింగ్ చేసేస్తున్నారు. వింటేజ్ లుక్‌లో మెగాస్టార్ అదిరిపోయారంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రిలీజ్‌పై వీడని సస్పెన్స్
ఇక ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ విషయంలో మెగా ఫ్యాన్స్ కన్‌ఫ్యూజన్ ఇంకా పోలేదు. ఏప్రిల్లో ఈ సినిమా రావాలి. ఆ తరవాత May 9 అన్నారు. ఈ రెండు డేట్లూ పోయినట్టే. వేసవిలో ఈ సినిమా రాదన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఎప్పుడొస్తుంది? ఆగస్టు 22 సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తే బాగుంటుందన్నది UV క్రియేషన్స్ ఆలోచన. ఇక ఈ మూవీలో చిరుకి జోడీగా త్రిష(Trisha) నటిస్తోంది.