ఈ మధ్య కాలంలో స్పామ్ కాల్స్, ప్రమోషనల్ మెసేజ్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. బ్యాంకులు, క్రెడిట్ కార్డ్స్, లోన్ యాప్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలు.. ఇలా ప్రతీ రంగం నుంచీ రోజూ పలు ప్రోమోషనల్ కాల్స్ మనకు వస్తూనే ఉంటాయి. ఈ హడావుడి వల్ల ప్రజలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం DND TRAI (Do Not Disturb) అనే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఒక ‘స్పామ్ షీల్డ్’లా పని చేస్తూ, మీకు అవసరం లేని కాల్స్, మెసేజ్‌ల నుంచి రక్షిస్తుంది.
DND TRAI యాప్ ఎలా వాడాలి? స్టెప్ బై స్టెప్ గైడ్
1. యాప్ డౌన్‌లోడ్ చేయండి
Android వినియోగదారులు Google Play Store నుంచి, iPhone వినియోగదారులు App Store నుంచి ‘DND TRAI’ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2. లాగిన్ అవ్వండి
యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
ఓటీపీ ద్వారా లాగిన్ ప్రక్రియ పూర్తి చేయండి.
3. ప్రిఫరెన్స్‌ను మార్చండి
యాప్ డాష్‌బోర్డులో ‘Change Preference’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మీరు ఏ కేటగిరీకి చెందిన కాల్స్ కావాలో / కావాలనుకోవడంలేదో ఎంపిక చేసుకోవచ్చు.
4. స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయండి
మీరు పూర్తిగా కొన్ని కేటగిరీలను (ఉదా: బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, విద్య) పూర్తిగా బ్లాక్ చేయవచ్చు.
SMSలకో, కాల్స్‌కో మాత్రమే బ్లాక్ చేయాలా అనే ఎంపిక కూడా ఉంది.
5. టైమ్ సెట్ చేయండి
వారానికి ఏ రోజులు, ఏ సమయాల్లో కాల్స్ రావొచ్చో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఉదా: రాత్రి సమయంలో బ్లాక్ చేయడం.
మోసపూరిత కాల్స్, మెసేజ్‌లపై ఫిర్యాదు ఎలా చేయాలి?
1. ‘Fraud Call/SMS’ ఎంపికపై క్లిక్ చేయండి.
2. అది మీను DOT (Department of Telecommunications) వెబ్‌సైట్‌కి తీసుకెళ్తుంది.
3. అక్కడ మీరు మోసపూరిత కాల్స్, SMSల గురించి వివరాలు ఇచ్చి ఫిర్యాదు చేయవచ్చు.
4. WhatsAppలో వచ్చే మోసపూరిత మెసేజ్‌లు, కాల్స్‌పై కూడా ఇక్కడ ఫిర్యాదు చేయడం వీలవుతుంది.
ఫైనల్‌గా చెప్పాలంటే…
స్పామ్ కాల్స్, మోసపూరిత మెసేజ్‌ల నుంచి మీ మొబైల్‌ను కాపాడుకోవాలంటే DND TRAI యాప్ మీకు మేలైన పరిష్కారం. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో భద్రతపరంగా కూడా ఇది నమ్మదగిన యాప్. వెంటనే డౌన్‌లోడ్ చేసుకుని, మీ ఫోన్‌కు ‘స్పామ్ ప్రొటెక్షన్’ ఇవ్వండి.






