Pushpa-2 OTT: పుష్పరాజ్ వచ్చేశాడు.. రీలోడెడ్ వర్షెన్‌తో ఓటీటీలోకి పుష్ప-2

సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2 OTT Release) ఓటీటీలోకి వచ్చేసింది. అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌గా, రీలోడెడ్ వెర్షన్‌(Reloaded version)తో డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు అర్ధరాత్రి నుంచి ఈ చిత్రం నెట్‌ ఫ్లిక్స్‌(Netflix)లో అందుబాటులోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మూవీ టీమ్ పేర్కొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా, సుకుమార్(Director SUkumar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే.

ఓటీటీలోనూ కొత్త రికార్డులు నెలకొల్పుతుందా?

గత ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయిలో వసూళ్లు(Collections) రాబట్టి చరిత్ర సృష్టించింది. డిసెంబరు 5న 3 గంటలా 20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప2’కు అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలకు పెరిగింది. ఇప్పుడు OTT వెర్షన్‌ను కూడా ఇదే రన్ టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద రూ.1896 కోట్లకుపైగా వసూళ్లను కొల్లగొట్టినట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో ఇప్పుడు ఓటీటీలోనూ కొత్త రికార్డులు నెలకొల్పుతుందని మూవీ టీమ్, ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మరి ఇంకెందుకు ఆలస్యం..

దంగల్(Dangal) తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా పుష్ప-2 రికార్డుల కెక్కింది. ఇటీవలే రిలీజ్ చేసిన పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కొత్త సీన్లను చూడడానికి నార్త్‌(North)లో ఇప్పటికీ ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఇప్పటికీ పుష్ప 2 థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా థియేటర్లలో రిలీజై దాదాపు రెండు నెలలు కావస్తోంది. దీంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఎప్పుడెప్పుడు OTTలో చూద్దామా? అని చాలామంది వేయికళ్లతో ఎదురు చూసిన ప్రేక్షకులకు మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ పుష్పరాజ్ రీలోడెడ్ వర్షెన్‌ను చేసేయండి..

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *