Legend 90 League: క్రీడా లవర్స్‌కు పండగే.. ఇండియాలో మరో క్రికెట్ లీగ్

క్రికెట్‌(Cricket)లో రోజుకో కొత్త ప్రయోగం తెరమీదకొస్తోంది. అన్ని దేశాలు తమ దేశంలో ఆడే ఫ్రాంచైజీ లీగ్‌(Franchise Leagues)లలో ఆటనుక కాస్త డిఫరెంట్‌గా, ఆసక్తికరంగా మార్చేందుకు అన్ని క్రికెట్ బోర్డు(Cricket Boards)లు కొత్తగా ఆలోచిస్తున్నాయి. ఇటీవల, ఆటలో వేగాన్ని పెంచడానికి T10, ది హండ్రెడ్ లీగ్(The Hundred League) వంటి ఫార్మాట్లు కూడా ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. ఇప్పుడు ఇండియా(India)లో కొత్త ఫార్మాట్ ప్రారంభం కానుంది. ఇందులో 90-90 బంతులతో మ్యాచ్‌లు ఉంటాయి. లెజెండ్ 90 లీగ్(Legend 90 League) రాయ్‌పూర్‌లో ఫిబ్రవరి 6 నుంచి 18 వరకు జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో రిటైరైన చాలా మంది ఆటగాళ్లు వీటిలో ఆడుతూ కనిపిస్తారు.

7 జట్లతో 90-బంతుల ఫార్మాట్‌

లెజెండ్ 90 లీగ్‌లో మొత్తం 7 జట్లు ఆడనున్నాయి. విశేషమేమిటంటే ఈ లీగ్‌లో 90-90 బాల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh), శిఖర్ ధవన్, సురేష్ రైనా, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వంటి ఎందరో గొప్ప ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడనున్నారు. లెజెండ్స్ 90 లీగ్ డైరెక్టర్ శివన్ శర్మ(Legends 90 League Director Shivan Sharma) మాట్లాడుతూ, ‘క్రికెట్‌లోని కొంతమంది గొప్ప ఆటగాళ్లతో ఈ ప్రత్యేకమైన, వేగవంతమైన 90-బంతుల ఫార్మాట్‌ను హోస్ట్ చేయడానికి మేం చాలా సంతోషిస్తున్నాం. ప్రపంచ స్థాయి, అద్భుతమైన దేశీయ ఆటగాళ్లతో కూడిన ఈ లీగ్ అభిమానులకు వినోదాన్ని అందించగలదని పూర్తి ఆశిస్తున్నాం అంటూ తెలిపారు.

ఫ్రాంచైజీ జట్ల జాబితా ఇదే..

ఈ లీగ్‌లో ఛత్తీస్‌గఢ్ వారియర్స్(Chhattisgarh Warriors), హర్యానా గ్లాడియేటర్స్, దుబాయ్ జాయింట్స్, గుజరాత్ సాంప్ ఆర్మీ, ఢిల్లీ రాయల్స్, బిగ్ బాయ్స్, రాజస్థాన్ కింగ్స్ జట్లు పాల్గొంటాయి. ఛత్తీస్‌గఢ్ వారియర్స్‌లో మార్టిన్ గప్తిల్, సురేశ్ రైనా(Suresh Raina), అంబటి రాయుడు వంటి ఆటగాళ్లు ఉండగా, ఢిల్లీ రాయల్స్‌లో రాస్ టేలర్, శిఖర్ ధవన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. హరియాణా గ్లాడియేటర్స్ కూడా హర్భజన్ సింగ్‌ను తమ జట్టులో భాగంగా చేసుకుంది. మరోవైపు వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో రాజస్థాన్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విశేషమేమిటంటే బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan) కూడా ఈ లీగ్‌లో భాగం కావడం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *