పోచరానికే మా మద్దతు..!

బాన్సువాడ అసెంబ్లీ నుంచి మళ్లీ పోచారం శ్రీనివాస్​రెడ్డికి ఏకగ్రీవంగా తమ మద్దతు తెలుపుతున్నట్లు నస్రూల్లాబాద్​ మండల కురుమసంఘం వాసులు గురువారం ప్రకటించారు. బీఆర్​ఎస్​ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న పోచారానికి మా మద్దతు ఉండబోతుందని చెప్పారు. బోమ్మన్​దేవ్​పల్లి గ్రామానికి చెందిన కురుమ కుటుంభాలు సంపూర్ణ మద్దతు ప్రకటించిన తీర్మాణ పత్రాలను పోచారానికి అందించారు. ప్రభుత్వం నుంచి 75శాతంతో గొర్రెలు పంపిణీ చేసి కురుమ వృత్తిని ప్రొత్సహించారని పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసిన ఘనత ఒక్క పోచారం శ్రీనివాస్​రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజల కష్ట, సుఖాల్లో అండగా నిలుస్తూ పేదల కుటుంభాల్లో ఒకడిగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు.

తమ ఓట్లు పోచారానికే వేస్తామని ప్రకటించడంతోపాటు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తమ ఊరికి రావొద్దని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ మెంబర్ మాజీద్, PACS చైర్మన్ కురుమ గంగారాం, MPTC నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ కురుమ సాయిలు,పవన్ గౌడ్ ఉన్నారు.

Share post:

Popular