జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్(Pahalgam)లో టూరిస్టులపై లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడి(Terror Attack)ని భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్పటి వరకూ 28 మంది మరణించగా.. ఇందులో ఇద్దరు విదేశీయులు (Nepal, UAE) ఉన్నారు. మరో 20 మందికిపైగా పౌరులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) స్పందించారు. అమాయక టూరిస్టులపై అత్యంత దారుణానికి ఒడిగట్టిన ఉగ్రవాదులు, వారి వెనుకున్న సూత్రధారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. ఈరోజు ఆయన త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(Cheif Of Defence Staff)తో సమావేశమయ్యారు.

ఉగ్రవాదంపై మాది జీరో టాలరెన్స్ విధానమే..
అనంతరం ఆయన మాట్లాడుతూ “ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి సమీప భవిష్యత్తు(Future)లోనే గట్టి సమాధానం చెబుతాం” అని హెచ్చరించారు. “దాడి చేసిన వారిని పట్టుకోవడమే కాదు, ఈ కుట్ర వెనుక తెరచాటున దాగి ఉన్న వారిని కూడా వదిలిపెట్టం. దాడి చేసిన వారిని, వారి వెనుక ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదం(Terrorism)పై పోరులో భారత్ ఐక్యంగా ఉందని, ఉగ్రవాదం పట్ల తమది ‘జీరో టాలరెన్స్(Zero Tolerance)’ విధానమని రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. అవసరమైన సమయంలో తగిన ప్రతిచర్య(Reaction) తప్పక ఉంటుందని స్పష్టం చేశారు.
#WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, “Yesterday, in Pahalgam, targeting a particular religion, terrorists executed a cowardly act, in which we lost many innocent lives… I want to assure the countrymen that the government will take every… pic.twitter.com/VhNHD0kO2E
— ANI (@ANI) April 23, 2025








