
బంగారం.. అంటే కొందరికి ఎనలేని ఇష్టం. మరికొందరికి సెంటిమెంట్.. ఇంకొందరికి ఇన్వెస్ట్‌మెంట్(Innvestment) ఎలిమెంట్. ఏది ఏమైనా పసిడికి డిమాండ్(Gold Demand) మాత్రం రోజురోజుకీ పెరుగిపోతుంది. అందుకు తగ్గట్లే ధరలు(Rates) సైతం కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం శుభ కార్యాల సీజన్ కావడంతో అది కాస్త రెట్టింపు అయింది. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు పుత్తడి కొనాలంటేనే జంకుతున్నారు. ఈ ఏడాది నుంచి పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు(Gold Rates) ఇవాళ (ఫిబ్రవరి 22) ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..
హైదరాబాద్(HYD)లో ఇవాళ గోల్డ్ రేట్స్ ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ. 200 పెరిగి రూ. 80,450 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 330 తగ్గి రూ.87,770 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరిగి రూ.80,450 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ. 20 పెరిగి రూ. 87,770 వద్ద ఉంది. ఇక కిలో కేజీ వెండి(Silver Price) ధర రూ.100 తగ్గి రూ.1,07,800 వద్ద కొనసాగుతోంది.