ఐపీఎల్ 2025 సీజన్ అంచనాలకు మించి సాగుతోంది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత దిగ్గజ జట్లుగా పేరొందిన ముంబై ఇండియన్స్(MI), చెన్నై సూపర్ కింగ్స్(CSK) పేలవమైన ఆటతో విమర్శల పాలవుతున్నాయి. అటు ఓపెనర్ నుంచి పదో నంబర్ వరకూ అందరూ బ్యాటింగ్ చేసే ఆటగాళ్లున్న సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) పరిస్థితీ అదే. హేమాహేమీ జట్లుగా పేరున్న ఈ మూడు జట్లు ఈ సారి విజయాల కోసం తీవ్రంగా కష్టపడుతున్నాయి. దీంతో మూడు దిగ్గజ పాయింట్స్ టేబుల్(Points Table)లో దిగువ మూడు స్థానాల్లో ఉండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏప్రిల్ 10, 2025 నాటికి ఈ హేమాహేమీ జట్లు గత విజయాలతో సంబంధం లేకుండా దారుణంగా విఫలమయ్యాయి. అసలు ఈ జట్ల పతనానికి గల కారణాలు ఏంటో ఓ లుక్కేద్దాం..

SRH విధ్వంసకర బ్యాటర్లున్నా విఫలమే
2024 ఐపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, తమ విధ్వంసకర బ్యాటింగ్, క్రమశిక్షణ బౌలింగ్‌తో పేరుగాంచిన జట్టు. ఈ సీజన్‌లో తమ పాత ఫామ్‌ను పూర్తిగా కోల్పోయింది. 5 మ్యాచ్‌లలో కేవలం ఒక విజయంతో, -1.629 నెట్ రన్ రేట్‌తో టేబుల్ దిగువన నిలబడింది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ వైఫల్యం జట్టును దెబ్బతీస్తోంది. పాట్ కమిన్స్ నాయకత్వంలో బలంగా ఉండే బౌలింగ్ యూనిట్ కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయలేకపోయింది. మెగా వేలంలో బలమైన కోర్‌ను నిలుపుకున్నప్పటికీ, కొత్త ఆటగాళ్లు సమష్టిగా ఆడలేకపోవడంతో ఫలితాలు రివర్స్ అవుతున్నాయి.

MIకి స్టార్లున్నా రిజల్ట్స్ నిల్
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన MI కూడా సమస్యల్లో కూరుకుపోయింది. ఐదు మ్యాచ్‌లలో ఒక్క విజయంతో, -0.010 నెట్ రన్ రేట్‌తో 9వ స్థానంలో నిలబడింది. MIలో రోహిత్, సూర్యకుమార్, పాండ్య, బుమ్రా వంటి స్టార్లున్నా విజయాలను అందుకోలేకపోతోంది. గాయాలు ఈ జట్టును తీవ్రంగా దెబ్బతీశాయి. బౌలింగ్ స్పియర్‌హెడ్ బుమ్రా ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడటం వీరి బలాన్ని దెబ్బతీసింది. పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించిన తర్వాత వ్యూహాత్మక నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. కొద్ది మందిపై ఆధారపడటం, వేలం తర్వాత జట్టు కూర్పు స్థిరంగా లేకపోవడం MIని సంక్షోభంలోకి నెట్టాయి.

CSKకి అనుభవం సరిపోలేదు
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన CSK కూడా ఐదు మ్యాచ్‌లలో ఒక విజయంతో, -0.891 నెట్ రన్ రేట్‌తో దిగువ నుంచి 3వ ప్లేస్ లో ఉంది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో CSK మార్చి 23న MIపై విజయంతో ఆరంభించినప్పటికీ, ఆ తర్వాత మ్యాచ్‌లలో 4 ఓడిపోయింది. CSKలో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, శివమ్ దూబే వంటి అనుభవజ్ఞులు ఉన్నా కూడా వారు విజయాలను అందించలేకపోతున్నారు. బ్యాటింగ్‌లో దూకుడు లోపించింది. గైక్వాడ్ స్థిరంగా ఆడలేకపోవడంతో మిడిల్ ఆర్డర్ ఒత్తిడిలో కుప్పకూలింది. బౌలింగ్ కూడా బలహీనంగా ఉంది.
)
ఇప్పటికైనా ఈ మూడు జట్లు తమ ప్రధాన సమస్యలేంటో గుర్తెరగాలి. వాటిని చక్కదిద్దుకొని పరిస్థితులకు తగ్గట్లు తమ ఆటను మార్చుకుంటే టాప్-4కి చేరుకోవచ్చనడంలో ఎలాంటి సందేహం లేదు.






