RCB vs DC: చిన్నస్వామిలో చిందేసేదెవరు? టాస్ నెగ్గిన క్యాపిటల్స్

ఐపీఎల్ 2025లో మరో ఆసక్తి పోరు జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు పోటీ పడటం ఇదే తొలిసారి. అటు బలాబలాలు చూస్తే RCB ఫుల్ ఫామ్‌లో ఉంది. కోల్‌కతా, చెన్నై, ముంబై ఇండియన్స్‌ను వాళ్ల హోం గ్రౌండ్‌లోనే ఓడించి చరిత్రలు తిరగరాసింది.

ఈ సీజన్‌లో అనూహ్య విజయాలతో పాయింట్ల టేబుల్‌లో దూసుకుపోతోంది. ఆర్సీబీ ఈ సీజన్‌లో ఒక్క చిన్నస్వామి స్టేడియంలో తప్ప మిగతా చోట్ల ఆడిన మ్యాచ్‌లన్నీ గెలిచేసింది. మరోవైపు ఢిల్లీ ఆడిన 3 మ్యాచుల్లోనూ విజయభేరి మోగించింది. దీంతో ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొంది. ఆర్సీబీ సేమ్ జట్టుతో బరిలోకి దిగుతుండగా.. DC ఒక మార్పుతో ఆడుతోంది. రిజ్వి స్థానంలో ఫాఫ్ డుప్లెసిస్ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు ఇవే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(C), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(Wk), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్

RCB Impact Sub: సుయాష్ శర్మ, రసిఖ్ దార్ సలాం, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కేఎల్ రాహుల్(Wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(C), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

DC Impact Sub: అభిషేక్ పోరెల్, దర్శన్ నల్కండే, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, డోనోవన్ ఫెరీరా

Related Posts

ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *