మార్క్ శకంర్ డిశ్చార్జ్.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

అగ్నిప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కుమారుడు మార్క్ శంకర్(Mark Shanker) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సోషల్ మీడియా(X) వేదికగా తెలియజేశారు. ‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి వచ్చేశాడు. అయితే, ఇంకా కోలుకోవాల్సి ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

ఆంజనేయస్వామి దయ, కృపతో..

కాగా తమ కులదైవమైన ఆంజనేయస్వామి దయ, కృపతో మార్క్ శంకర్ త్వరలోనే పూర్తి ఆరోగ్యం(Healthy)తో మునుపటిలా ఉంటాడని చిరు ఆకాంక్షించారు. కాగా రేపు హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) అని చిరంజీవి గుర్తు చేశారు. ఆ స్వామి తమ పసిబిడ్డను ఒక పెద్ద ప్రమాదం నుంచి, విషాదం నుంచి కాపాడి తమకు అండగా నిలిచారని ఆయన అన్నారు.

ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో, తమ తమ ప్రాంతాల్లో ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేసి, ఆశీస్సులు అందజేస్తూ తమకు అండగా నిలుస్తున్నారని రాసుకొచ్చారు. వారందరికీ తన తరఫున, పవన్ కళ్యాణ్ తరఫున, తమ కుటుంబం తరఫున ధన్యవాదాలు(Thanks) తెలియజేస్తున్నానని మెగాస్టార్ పేర్కొన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *