మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్(Gali Janardhan) తనయుడు కిరీటి(Kireeti) ఇటీవలే `జూనియర్(Junior)` సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫస్ట్ మూవీతోనే అతడు విమర్శకుల ప్రశంసలందుకుని నటుడిగా పాస్ మార్కులు కొట్టేశాడు. అద్భుత డాన్సు(Dance)లతో ఇరగ దీశాడు. అది మేకింగ్ వీడియోలతో కిరీటీ కష్టం బయట పడింది. సినిమాలంటే ఎంత ఫ్యాషన్‌గా ఉన్నాడో మేకింగ్ వీడియోల(Making videos)తోనే ప్రూవ్ అయింది. అయితే నటుడిగా మరింత మెరుగు పడాలని, కంటెంట్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని ముందుకెళితే తర్వలోనే స్టార్ రేంజ్‌కి ఎదగడం ఖాయమని సినీ విశ్లేషకులు(Film critics) అభిప్రాయపడుతున్నారు.
లాంటి కంటెంట్‌తో వస్తాడు?
డెబ్యూ తోనే ప్రేక్షకు(Fans)ల్లో తనదైన ముద్ర వేశాడు కిరీటి. ఈనేపథ్యంలో అతడి తర్వాత స్టెప్ ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. రెండో సినిమా ఏ డైరెక్టర్‌తో చేస్తాడు? ఎలాంటి కంటెంట్‌తో వస్తాడు? అన్నది చూడాలి. నటుడిగా కొనసాగే అవకాశాలు కిరీటిలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. అతడిలో కష్టపడే తత్వం ఉంది. `జూనియర్` యాక్షన్ సన్నివేశాల(Action scenes) కోసం ఎలాంటి డూప్ రోప్ లేకుండానే నటించాడు. నటుడికి ఇదంత ఈజీ కాదు. ఎంతో రిస్క్‌తో కూడుకున్న పనే. ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప చేయలేని పనిని సాధ్యం చేసి చూపించాడు కిరీటి.
‘ಜೂನಿಯರ್ʼಗಾಗಿ ಕಿರೀಟಿ ಶ್ರಮ ಹೇಗಿತ್ತು?
ತೆರೆಹಿಂದಿನ ಆಕ್ಷನ್ ಸ್ಟಂಟ್ ವಿಡಿಯೋ ವೈರಲ್!@PROHarisarasu @KireetiOfficial #kannadascreens #sandalwood #junior #filmreview #kireeti #srileela #GeneliaDeshmukh #ravichandran #actionvideo #liveaction pic.twitter.com/Lyd51bvfCv
— Kannada Screens (@KannadaScreens) July 23, 2025
అవసరమైతే నిర్మాతగానూ మారే అవకాశం
ఇక ఫైనాన్షియల్‌గా కిరీటికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అవసరమైతే తానే నిర్మాత(Producer)గానూ మారిపోతాడు. అంతటి రేంజ్, సత్తా ఉన్నవాడు. తనయుడి కోసం జనార్దన్ కూడా ఎంతైనా ఖర్చు చేసే అవకాశం ఉన్నవారు. కాబట్టి కిరీటీ చేయాల్సిందల్లా? మంచి దర్శకుడిని వెతికి పట్టుకోవడమే. సరైన కథ మేకర్ దొరికితే కిరీటి వేగంగా షైన్ అవుతాడంటున్నారు. బ్యాకెండ్‌లో వారాహీ బ్యానర్(Varahi Banner) ఎలాగూ ఉంది. దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) సహకారం కూడా ఉండనే ఉంది. ఎందుకంటే జూనియర్ సినిమాకు రాజమౌళి గెస్ట్‌గా రావడం చాలా వరకూ కలిసొచ్చింది. పైగా కన్నడ, తెలుగు కనెక్షన్ ఉన్న నటుడు కాబట్టి కిరీటికి కలిసొస్తుందని సినీవిశ్లేషకులు అంటున్నారు.







