టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌లలో నిధి అగర్వాల్(Nidhi Agarwal) ఒకరు. సినిమాల పరంగా పెద్దగా విజయాలు అందుకోలేకపోయినప్పటికీ, స్టార్ హీరోలతో సినిమాల్లో అవకాశాలు అందుకొంటోంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయాయి. కానీ రామ్ పోతినేని సరసన నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.
ఆ తరవాత తమిళ సినిమాల్లో నటించినా ఆమెకు గట్టి బ్రేక్ రాలేదు. కానీ ఇప్పడు ఆమెకు పాన్ ఇండియా ప్రాజెక్టులలో అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం ప్రభాస్(Prabhas) సరసన ‘రాజాసాబ్’(Raja Raja Saab), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)జోడిగా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. నిధి కెరీర్ టర్నింగ్ పాయింట్ గా ఈ సినిమాలు నిలుస్తాయో లేదో చూడాలి మరి.
View this post on Instagram
ఇక సినిమాలతో పాటు నిధి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫోటోలు, వీడియోలు, పోస్ట్‌లతో ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటోంది. తాజాగా ట్విట్టర్ వేదికగా ఫాలోవర్లతో చిట్‌చాట్ నిర్వహించిన నిధి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రతి రోజు రాత్రి మర్డర్ మిస్టరీలు చూస్తానని, ప్రస్తుతం కొత్త కంటెంట్ దొరకడం లేదని పేర్కొంటూ, అభిమానుల్ని సజెషన్లు ఇవ్వమని కోరింది. “ఏ భాష అయినా సరే.. మంచి మర్డర్ మిస్టరీలు చెప్పండి” అంటూ ట్వీట్ చేయడంతో ఆమె కామెంట్ వైరల్ అయింది.
దీనిపై నెటిజన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇటీవల జరిగిన మేఘాల హానీమూన్ కేసు, తేజేశ్వర్ మర్డర్ కేసు వంటి రియల్ లైఫ్ మిస్టరీలపై రీసర్చ్ చేయమని సూచిస్తున్నారు. అలాగే ఇటీవల తెలుగు లో వచ్చిన కొన్ని క్రైమ్ థ్రిల్లర్లను కూడా చూడమని సలహాలు ఇస్తున్నారు.






